ప్రతి ఏడాది దత్తాత్రేయ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీల నేతలు కలుసుకుంటారు. లెఫ్ట్, రైట్, ఇలా అనే పార్టీలకు అలాయ్ బలాయ్ ఓ వేదికగా నిలుస్తుంది.
ఇలా అన్ని పక్షాల నేతలను ఒక దగ్గరి చేర్చడం దత్తన్నకు తప్ప మరొకరికి సాధ్యం కాదని, ఈ కార్యక్రమాన్ని చూసిన వారు అంటుంటారు. ఆ కొన్ని గంటలు విమర్శలు, వైరుధ్యాలు పక్కన పెట్టి పాలల్లో నీళ్లలా కలిసిపోతారు. ఇలా ఈ కార్యక్రమంలో ప్రతి ఏడాది అందరూ సందడి చేసి జ్ఞాపకాలను మూట కట్టుకుని పోతుంటారు.
కానీ ఈ సారి ఆసక్తికరమైన ఘటన జరిగింది. అందరూ నవ్వుకుంటూ ఆపాయ్యంగా ఆలింగనం చేసుకుంటుంటే.. ఓ ఇద్దరు మాత్రం బద్ధ శత్రువుల్లా వ్యవహరించారు. ఈ ఇద్దరు ఎవరో కాదు జనసేన అధినేత పవన్, ‘మా’అధ్యక్షుడు మంచు విష్ణు.
అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కూడా మా మంటలు చెలరేగాయి. పవన్, విష్ణు పక్కపక్కనే కూర్చున్నారు. పవన్‌తో మాట్లాడేందుకు మంచు విష్ణు యత్నించారు. అయితే పవన్ అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోయారు. వేదికపై ఆ ఇద్దరు ఎదురుపడ్డారు. కానీ మాట్లాడుకోలేదు.
కార్యక్రమంలో భాగంగా ఆహ్వానితులకు సత్కారాలు, సన్మానాలు కామన్‌గా చేస్తుంటారు. పవన్ మెమొంటో ఇచ్చారు. తర్వాత విష్ణుకు కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే మరొకసారి ఇద్దరు ఎదురుపడ్డారు. ఈ సారి కూడా మాట్లాడుకోలేదు. ఈ తర్వాత ఇద్దరి కుర్చీలు పక్కపక్కనే ఉన్నాయి. అబ్బే అక్కడ కూడా అదే తీరు. తూర్పు, పరమడ లాగ రుసరుసలాడుతూ కూర్చున్నారు. దీనికి అంతటికి కారణం మా ఎన్నికలే అన్నది తెలిసిందే.
మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలి మద్దతు ఇచ్చిన ప్రకాష్‌రాజ్ ప్యానల్ ఓడిపోయింది. ఎన్నికల తీరుపై అనేక ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా మూకమ్మడి రాజీనామాలు చేశారు. ఇలా వాడివేడిగా ఉన్న సమయంలోనే మా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం మరింత ఆజ్యం పోసింది.
మా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవానికి అందరూ చిరంజీవిని ఆహ్వానిస్తారని అనుకున్నారు. అది కూడా జరుగలేదు. దీంతో అటు మెగా అభిమానులకు జనసేన కార్యకర్తలు చిర్రెత్తుకొచ్చింది. విష్ణుకు తగిన బుద్ధిచెప్పారని జనసేన కార్యకర్తలు అనుకుంటున్నారు.
మా ఎన్నికలు జరిగిన వెంటనే మంచు విష్ణు సోదరుడు మనోజ్ ‘భీమ్లా నాయక్’సెట్స్‌కి వెళ్లి పవన్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరూ ఏకాంతంగా గంట పాటు మాట్లాడుకున్నారంట. అప్పటివరకు వాడివేడిగా ఉన్న వాతావరణం పవన్‌తో మనోజ్ భేటీ కాస్త వేడిని చల్లార్చిందని అనుకున్నారు. ఇంతలోనే అలాయ్ బలాయ్ కార్యక్రమంలో విష్ణును కనీసం పలకరించేందుకు కూడా పవన్ ఇష్టపడకపోవడం మరోసారి చర్చకు దారితీసింది.
మా ఎన్నికలకు ముందు విష్ణు, ప్రకాశ్ రాజ్ సెల్ఫీ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై నెటిజన్స్ ఒకింత నెగటివ్‌గానే స్పందించారు. రోజుల తరబడి మీడియాలో తిట్టుకుని ఇప్పుడిదేంటంటూ కామెంట్స్ చేశారు. విష్ణు ట్విట్‌పై మంచు మనోజ్ రియాక్షన్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది.
వాటమ్మా, వాటీజ్ దిస్ అమ్మా?!’అని ట్విట్టర్లో సరదాగా వ్యాఖ్యానించారు. దీనిపై కూడా నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేశారు. కొందరు మనోజ్ రియాక్షన్‌ను మెచ్చుకున్నారు. మరికొందరైతే ‘‘విష్ణుని మనోజే ఇలా ట్రోల్ చేస్తే ఎలా?’’అని ప్రశ్నించారు.