కోల్‌కతా: మమతా బెనర్జీ ఈ రోజు బెంగాల్లో ఘన విజయం సాధించినప్పటికీ నందిగ్రామ్‌లోని క్లిఫ్హ్యాంగర్లో బిజెపికి చెందిన సువేందు అధికారి చేతిలో తాను ఓడిపోయారు. రాజ్యం గెలిచాడు, అనుభవించడానికి రాజే లేడు అన్నట్లుంది మమత బెనర్జీ పరిస్థితి.
బీజేపీ సవాలు విసిరిందని… బీజేపీ చెప్పిన స్థానంలో పోటీ చేసిందావిడ. నిజానికి అక్కడ ఆమె భారీ మెజారిటీతో ఓడిపోతుంది అనుకున్నారు. చాలా గట్టి పోటీ పోటీ ఇచ్చి ఓడారు. చివరి వరకు టగ్ ఆఫ్ వారే.
ప్రజల మనసు దోచుకున్న మమత “నందిగ్రాం‘‘లో విశేషమైన ఖ్యాతి పేరుప్రఖ్యాతులు ఉన్న సువేందు అధికారిపై పోటీ చేయడం ఒక ట్రాప్. ఆమె ఆ ట్రాప్ లో పడ్డారు. అది పక్కన పెడితే… ఆమె ఓటమితో ఆమెకు వాటిల్లే నష్టమేమీ గొప్పగా ఉండదు.
అనేక ట్విస్టుల అనంతరం ఆమె ఓడిపోయారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘ తీర్పును నేను అంగీకరిస్తున్నాను – ఇది పెద్ద విషయం కాదు. చింతించకండి” అని ప్రకటించారు.
దీనిపై ఆమె కోర్టును ఆశ్రయిస్తారని ప్రకటించారు. చివరి రౌండు పూర్తయ్యాక 2 లోపు ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. కానీ బీజేపీ చేతికి రాష్ట్రం చిక్కకుండా కాపాడారు. చరిత్ర గుర్తుంచుకునే విజయాన్ని సాధించారు.
2011 లో తొలిసారిగా మమతా బెనర్జీని అధికారంలోకి తెచ్చిన పట్టణం నందిగ్రామ్. సువేందు అధికారి మునుపు ఆమెతోనే ఉన్నారు.తర్వాత బీజేపీలో చేరారు. నిజానికి ఆ ప్రాంతంలోని సుమారు 10 నియోజకవర్గాల్లో సువేందు ప్రభావం ఉంటుంది. దానిని తగ్గించడానికి ఆమె నేరుగా ఇక్కడ పోటీ చేశారు. తను అనుకున్నది సాధించినా తాను ఓడిపోయారు.
కొసమెరుపు ఏంటంటే… మమతా బెనర్జీని 50,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించకపోతే రాజకీయాలను విడిచిపెడతామని సువేందు అధికారి ప్రతిజ్ఞ చేశారు. తన మాజీ గురువును నిందిస్తూ, అధికారి ఆమెను “మాజీ ముఖ్యమంత్రి” అని చెప్పే లెటర్‌హెడ్‌తో సిద్ధంగా ఉండమని కోరాడు… ట్విస్ట్ ఏంటంటే.. అతను రెండు ఛాలెంజ్ లు నిలుపుకోలేకపోయాడు.
My sincere thanks to the great People of Nandigram for their love, trust, blessings, and support, and for choosing me as their representative and the MLA from #Nandigram. It is my never-ending commitment to be of service to them and working for their welfare. I am truly grateful! pic.twitter.com/oQyeYswDa8
— Suvendu Adhikari (Modi Ka Parivar) (@SuvenduWB) May 2, 2021