???? చలో మహానాడు ???? pic.twitter.com/PwSjZs8RPk
— jay telugudesham jay charthamma (@remaduru) May 26, 2022
తెలుగుదేశం పార్టీ నలభై వసంతాల పండుగకు సర్వం సిద్ధమవుతోంది. రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంతోపాటు.. పొలిట్ బ్యూరో సమావేశం కూడా ప్రకాశం జిల్లాలోనే నిర్వహించాలని నిర్ణయించడంతో.. ఒక రోజు ముందుగానే పండుగ మొదలుకానుంది. మహానాడు సన్నాహక కార్యక్రమం నేడు ప్రారంభంకానుంది.
అధినేత చంద్రబాబు.. ఒక రోజు ముందుగానే… భారీ ర్యాలీతో ఇవాళ ఒంగోలు చేరుకోనున్నారు. సాయంత్రం జరిగే పొలిట్‌బ్యూరో సమావేశంలో.. మహానాడు అజెండాతో పాటు..రానున్న రోజుల్లో పార్టీపరంగా అనుసరించే రాజకీయ విధానాలను ఖరారు చేయనున్నారు.
ఒంగోలు వేదికగా జరగ నున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా.. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గానే నిర్వహిం చిన పార్టీ అధిష్టానం.. ఈ ఏడాది మాత్రం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని నిర్ణయించింది. పైగా.. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు.. పార్టీలో నేతల ను మరింత పుంజుకునేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
దీనికి గాను మహానాడును వేదికగా చేసుకుని.. ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే మహానాడును ప్రతి ష్టాత్మంగా తీసుకుంది. రెండు రోజుల పాటే నిర్వహించాలని తలపెట్టినప్పటికీ.. దీనిని భారీ రేంజ్లో నిర్వ హించేలా ప్రణాళిక చేశారు. పార్టీకి భవిష్యత్ ప్రణాళికలను ఈ వేదికగా చంద్రబాబు వెల్లడించను న్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ మహానాడు ఏర్పాట్లను ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నాయకులు ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతుల తేవడం.. 100 ఎకరాల్లో.. ఏర్పాట్లు చేయడం వంటివి అన్నీ కూడా .. పూర్తయ్యాయి.
మహానాడు ఏర్పాట్లను అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాష్ట్ర టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు నేతృత్వంలో చేశారు. మహానాడు వేదిక ఏర్పాట్ల నుంచి అతిథులకు ఆహ్వానం పలకడం వరకు.. వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంనుంచి అన్ని ఏర్పాట్లను వీరు ఇక్కడే ఉండి చూస్తున్నారు. ఈ క్రమంలో నాయకులు అందరూ ఒంగోలులోనే తిష్టవేసి మరీ.. పార్టీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు.. వారు చేపడుతున్నారు. షడ్రశోపేతమైన వంటకాలను తయారు చేసేందుకు పలు ప్రాంతాల నుంచి వంట మాస్టర్లను పిలిపించారు.