2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయిన వెంటనే తలలు పండిన సీనియర్లు సైతం ఒక్కసారిగా ఢీలా పడిపోయా.రు అంత ఘోరా ఓటమిని తలుచుకుని కుంగిపోయారు. మళ్ళీ అసలు పార్టీ పుంజుకుంటుందా ? 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా ? అంటే చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. అయితే పార్టీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఎలాంటి కాన్ఫిడెన్స్ కోల్పోకుండా పార్టీ ఆఫీసుకే అంకితమై పని చేసుకుంటూ వచ్చాడు పార్టీ యువనేత మద్దిపాటి వెంకటరాజు.
ఈయన 2019 ఎన్నికలకు ముందు గోపాలపురం అసెంబ్లీ సీటు ఆశించిన వెంకటరాజుకు ఆ సీటు దక్కకపోవడంతో నిరాశ చెందలేదు. గత ఎన్నికలకు ముందు వరకు వెంకటరాజు ఒక అసెంబ్లీ సీటు ఆశించిన ఆశావాహుడు.
అప్పటికే పార్టీ గోదావరి జిల్లాల శిక్షణ తరగతుల ఇన్చార్జ్గాను, లిడ్ క్యాప్ డైరెక్టర్ గాను ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి పరిమితమై పని చేసుకుంటూ వచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ తనకు అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో పూర్తి చేయడంతో చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ వెంకటరాజుపై నమ్మకం ఏర్పడింది. అందుకే పార్టీలో మహామహులు నిర్వహించిన.. పార్టీకి గుండెకాయ లాంటి ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పదవితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన్ను నియమించారు. నాలుగు పదుల వయసులో వెంకటరాజు రెండు కీలక పదవుల్లో నియమించబడటం పార్టీ పట్ల అతడి అంకితభావానికి.. చేసిన కృషికి దక్కిన ఫలితమే అని చెప్పాలి.
తెలుగుదేశం పార్టీ అంటేనే తలలు పండిన ఉద్దండలు, యోధాను యోధులు ఉంటారు. పార్టీ పుట్టినప్పటినుంచి పార్టీలో కొనసాగుతున్న మహామహులు కూడా ఉన్నారు. అటు సీనియర్లతో పాటు ఇటు కొత్త తరాన్ని సమన్వయం చేయటం ఎవరికి అయినా కత్తి మీద సాములాంటిదే. ఈ విషయంలో మద్దిపాటి చాలా వరకు సక్సెస్ అయ్యారు. వెంకటరాజుకు ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పదవి అలంకారం ఎంత మాత్రం కాదు.. ఖచ్చితంగా ఇది ముళ్ళ కిరీటమే.
భవిష్యత్తులో ఎన్నో సవాళ్లు కూడా ఎదురవుతాయి. వాటిని చాలా ఓపికతో సమన్వయంతో పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంటుంది. దీనికి తోడు పార్టీలో ఎదుగుతున్న క్రమంలో ఓ వైపు పూల పాన్పులు.. మరోవైపు ముళ్ళ బాటలు ఉంటానే ఉంటాయి. వీటన్నింటిని దాటుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంటుంది. ఏదేమైనా 2024 ఎన్నికల్లో పార్టీ పరంగా కీలకపాత్ర పోషించడంతోపాటు.. 2019 ఎన్నికల్లో తాను కోరుకున్న అసెంబ్లీ సీటు విషయంలో ఈ సారి ఆయనకే అన్న క్లారిటీ రావడంతో ఇప్పుడు ఆయన రాజకీయం మరింత కొత్తగా ఉండనుంది.
0q8euo