• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమ‌రావ‌తి: ఏపీ స‌ర్కారుకు మ‌రో భారీ దెబ్బ‌!

స‌ర్కారు నిర్ణ‌యాన్ని మూకుమ్మ‌డిగా వ్య‌తిరేకించిన రాజ‌ధాని ప్ర‌జ‌లు.. ఏం జ‌రిగింది?

NA bureau by NA bureau
September 12, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
amaravati ap capital

amaravati ap capital

0
SHARES
283
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా.. రాజధాని పరిధిలోని 22 పంచాయతీలతో అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని గ్రామ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

రాజధాని పరిధిలోని 19 గ్రామ పంచాయతీలతో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రయత్నించింది. ఇందుకోసం అప్పట్లో నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజలు ముక్తకంఠంతో ఆ ప్రతిపాదనను తిప్పికొట్టారు.

29 పంచాయతీలతో నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు రాజధాని పరిధి తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలతో కలిపి అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ జారీ చేసిన ఉత్తర్వులపై 21 పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణకు గుంటూరు కలెక్టర్‌ చర్యలు చేపట్టారు.

పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, మండల పరిషత్‌ ప్రత్యేక అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులను ఆయన ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులకు వెంటనే తాఖీదులిచ్చి తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. దీంతో తాజాగా అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై రాజధాని గ్రామాల్లో గ్రామసభలు కొనసాగుతున్నాయి. తొలుత లింగాయపాలెంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు.

ఇక్కడ 78 మంది స్థానికులు మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకించగా.. ఒకే ఒక్కరు అనుకూలంగా మద్దుతు తెలిపారు. ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించిన రెండో సభలో మున్సిపాలిటీ ఏర్పాటును ప్రజలంతా సామూహికంగా వ్యతిరేకించారు. ఈ రెండు గ్రామాల్లో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును ప్రజాభిప్రాయం ద్వారా తిరస్కరించారు.

హరిశ్చంద్రపురంలో మరో గ్రామసభ ప్రారంభమైంది. అయితే.. ఇక్క‌డ అస‌లు ప్ర‌జ‌లు ఎవ‌రూ రాలేదు. వ‌చ్చిన కొద్ది మంది కూడా వ్య‌తిరేకించ‌డం గ‌మ‌నార్హం. దీంతో అమ‌రావ‌తి విష‌యంలో స‌ర్కారుకు మ‌రో భారీ దెబ్బ‌త‌గిలిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags: AmaravatiandhrapradeshAP CapitalJaganycpYSRCP
Previous Post

ఫ్రీమాంట్లో లో తొలి ‘ఆయుర్హితం’ క్లినిక్‌!

Next Post

‘ మ‌ద్దిపాటి ‘… ముందున్న‌వన్నీ పెనుస‌వాళ్లే…!

Related Posts

Trending

రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?

December 3, 2023
Telangana

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

December 3, 2023
Top Stories

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

December 3, 2023
Trending

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

December 3, 2023
Telangana

కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్

December 3, 2023
KCR
Top Stories

కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?

December 3, 2023
Load More
Next Post

' మ‌ద్దిపాటి '... ముందున్న‌వన్నీ పెనుస‌వాళ్లే...!

Comments 1

  1. Pingback: అమ‌రావ‌తి: ఏపీ స‌ర్కారుకు మ‌రో భారీ దెబ్బ‌! - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?
  • సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే
  • రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!
  • రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు
  • కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్
  • కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?
  • బోణీ కొట్టి కాంగ్రెస్.. 2 చోట్ల గెలుపు
  • భారీ లీడ్ లో కాంగ్రెస్…బీఆర్ఎస్ కు షాక్
  • గుళ్లు-గోపురాలు.. రిజ‌ల్ట్ కు ముందు బిజీబిజీ
  • `ఒక్క ఛాన్స్‌.. మిస్ చేసుకోవ‌ద్దు..`  నేత‌ల‌పై కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం!
  • ప‌ల్నాడు పౌరుషం.. రోడ్డు మ‌ధ్య‌లో గోడ క‌ట్టేశారు.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌
  • వైసీపీ పై యుద్ధం: ఏపీలో కొత్త రాజ‌కీయ పార్టీ.. ఎవ‌రిదంటే!
  • గేమ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్
  • బీఆర్ఎస్ : కేసీఆర్ టైం గయా !
  • వైసీపీ ఎఫెక్ట్‌:  న‌లిగిపోతున్న నాలుగో సింహం.. కేంద్రం సీరియ‌స్‌

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra