తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ కంగా ముందుకు సాగుతున్నారు.
యువతను సమీకరించేలా.. లోకేష్ అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నిక ల సమయంలో లోకేష్ ఒక పక్కా వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుని దానికి తగిన విధంగా ముందుకు సాగారు. దీనిలో ప్రధానంగా డిజిటల్ ప్రచారాన్ని ఆయన విస్తృతం చేశారు. అదేవిధంగా యువతను ప్రతి విషయం లోనూ భాగస్వాములను చేశారు. వారిని ముందుండి నడిపించారు. ఫలితంగా యువత ఓట్లు టీడీపీకి పడ్డా యి. 2019లో అన్ని అస్త్రాలు వాడటం తెలిసినా ఓవర్ కాన్ఫిడెన్సుతో నిర్లక్ష్యం చేశారు.
ఇక, ఇప్పుడు దాదాపు ఇదే పాత ఫార్ములాకు కొత్త మార్పులు చేసి లోకేష్ ముందుకు సాగాలని డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. తిరుపతి గెలుపు పార్టీకి అత్యంత అవసరం. ఇటీవల జరిగిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో పా ర్టీకి ఎదు రైన అనుభవం నుంచి తేరుకుని.. నాయకులను, యువతను ముందుకు నడిపించాల్సిన అవస రం ఎంతైనా ఉంది.
తిరుపతి ఉప ఎన్నికలో సెంటిమెంటు లేక పోవడం.. కూడా టీడీపీకి ఇ బ్బందిగానే ఉంది. ఎందుకంటే.. రేపు వైసీపీ గెలిస్తే.. సానుభూతి ఓట్లు పడ్డాయని.. అందుకే.. తాము ఓడి పోయామని చెప్పుకొనే వెసులుబాటు టీడీపీకి లేదు.
ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో వచ్చిన ఈ ఎన్నికలో ఆ కుటుంబానికి జగన్ టికెట్ ఇవ్వలేదు. సో.. ఇక్కడ సెంటిమెంటు పవనాలు లేవు. కకాబట్టి.. వైసీపీ గెలిచినా.. సానుభూతి తోనే గెలిచింది అనే మాట చెప్పే అవకాశం లేదు.
ఇక, అధికారం వినియోగించేందుకు కూడా పెద్దగా అవకాశం లేదు. ఎందుకంటే.. కేంద్ర ఎన్నిక లసంఘం.. ప్రతి విషయాన్నీ స్క్రూటినీ చేస్తోంది. కాబట్టి.. ఇప్పుడు టీడీపీ కనుక కష్టపడి ఇక్కడ గెలవడమో.. లేదా.. మెరుగైన ఫలితాలు వచ్చేలా చేసుకోవడమో చేయాలి. దీనిని దృష్టిలో పెట్టుకునే.. లోకేష్.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు..
ఇప్పటికే సీబీఎన్ ఆర్మీని రంగంలోకి దింపుతున్నారు.. వచ్చే 15 రోజులు.. ప్రతి ఇంటికీ.. ఆ సైన్యం వెళ్లి.. ప్రచారం తీవ్రం చేస్తుంది. మరోవైపు డిజిటల్ ప్రచారం.. వాట్సాప్ , ట్విట్టర్, ఫేస్ బుక్.. ఇలా అన్ని రకాల మాధ్యమాల్లోనూ ప్రచారం సాగుతుంది.
ఇంకోవైపు యువతను సమీకరించి.. వారిని ప్రోత్సహించడం.. యువత ఓట్లు టీడీపీ వైపు మళ్లేలా వ్యవహరించడం వంటివి లోకేష్ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలుగా టీడీపీ నాయకులు చెబుతున్నారు.. ఇవికనుక ఈ 15 రోజులు సక్సెస్‌గా ప్రయోగిస్తే.. విజయం దక్కినట్టేనని అంటున్నారు.