నారా లోకేష్ ఈరోజు ఎందుకు నరసరావు పేట వస్తున్నాడు?
హైదరాబాదు ప్రియాంక రెడ్డిని చంపిన నిందితులను ఎన్ కౌంటర్ చేయించిన కేసీఆర్ కి సెల్యూట్ కొట్టిన జగన్ నరసరావు పేలో అనూష అనే అమ్మాయిని దారుణంగా చంపితే నిందితుడు ఎవరో కూడా లోకానికి తెలియకుండా వ్యవహారం నడిపిస్తున్నారు.
నారా లోకేష్ ఎందుకు ఈరోజు వస్తున్నాడు ?
ఏపీలో అసలు అమలులో లేని ఒక ఫేక్ చట్టం … ‘‘దిశ‘‘ ఉన్నట్లు జనాలకు అబద్ధాలు చెప్పి నమ్మిస్తున్న జగన్ బండారాన్ని బయటపెట్టడానికి.
దిశ చట్టం లేదా?
అవును… దిశ ముసాయిదా బిల్లు తయారుచేసి కేంద్రానికి పంపారు. అది ఐపీసీకి విరుద్ధంగా ఉంది మార్పులు చేసి పంపండి అని కేంద్రం అడిగితే దానికి రిప్లై ఇవ్వకుండా ఫైలును ఏపీ సర్కారు బుట్టలో పడేసింది. ఎందుకంటే అప్పటికే ఆ చట్టానికి సంబంధించి మైలేజీ వైసీపీకి వచ్చింది, పైగా అలాంటి నిబంధనలతో చట్టం చేయడానికి ఐసీపీ ఒప్పుకోదు. అందుకని దానిని పట్టించుకోలేదు.
దిశ చట్టం అనే ఫేక్ చట్టంలో ఏముంది?
అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తే 21 రోజుల్లో నిందితులను శిక్షిస్తాం అని… ఇదిగో టకటకా తెచ్చేస్తున్నాం 2020 ఆగస్టులో అంటే ఏడాది క్రితం సాక్షి టీవీలో జగన్ సర్కారు కొట్టిన డబ్బా ఈ వీడియోలో చూడండి.
మరి దిశ చట్టం ఇపుడు ఏమైంది?
అది అడగడానికే నారా లోకేష్ నరసరావుపేటకు వస్తున్నాడు. మీ దిశ చట్టం కింద మీ రు చెప్పినట్లు 21 రోజుల్లో న్యాయం చేయకపోతే అక్కడికి వచ్చి పోరాడతాను అని చెప్పారు. వైసీపీ సర్కారు న్యాయం చేయలేదు. అందుకే ఈరోజు నరసరావు పేటకు వస్తున్నారు.
కొసమెరుపు ఏంటంటే…
‘ నారా లోకేష్ ‘ఎక్కడికైనా వస్తున్నాడంటేనే జగన్ రెడ్డిప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.