ఒక ఎమ్మెల్యే కావడం అంటే సులువు కాదు.
దానికి రెండే మార్గాలు…
ఒకటి పార్టీ గాలి ఉండాలి
లేదా
అభ్యర్థి పేరు ఊరూ వాడా మారుమోగాలి
మొదటిది ఉన్నా లేకున్నా రెండో మాత్రం సాధిస్తాను అని అంటున్నాడు నారా లోకేష్
చరిత్రలో మంగళగిరి నియోజకవర్గంలో గెలుపు మొహం చూడని టీడీపీని గెలుపు గుర్రం ఎక్కిస్తాను అంటున్నాడు లోకేష్.
నాయకుడు అంటే బాధ్యత.. మరియు నమ్మకం కూడా ! దానిని కల్పిస్తాను అంటున్నాడు.
మరి అది ఎలా కల్పిస్తున్నాడో… మంగళగిరిలో ఏం జరుగుతుందో చూద్దాం.
వేసవిలో దాహార్తిని తీర్చేందుకు యువ నాయకుడు నారా లోకేశ్ తన వంతు సాయం మంగళగిరి నియోజకవర్గంకు చేస్తున్నారు. ఆయన కృషితో ఇక్కడ ప్రతిరోజూ వాటర్ ట్యాంకర్ ద్వారా ఇక్కడి ప్రజలకు నీరు అందుతోంది.
ఇదే కాదు ఇంకొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయాలని వీరంతా తపిస్తున్నారు. ఇప్పటికే కులమతాలకు అతీతంగా కొన్ని సేవా కార్యక్రమాల పేరిట దాతృత్వం చాటుకున్నారు లోకేశ్.
ఆ క్రమంలోనే చిరు వ్యాపారుల జీవనోపాధికి తోపుడు బండ్లు అందించారు. అదేవిధంగా కొన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా చేశారు. ఈ క్రమంలో భాగంగా చేనేతల కుటుంబాలకు ఆర్థిక చేయూత ఇచ్చారు.
అనారోగ్యంతో బాధపడుతున్న నేతన్నల కుటుంబాలకూ, ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలకూ అండగా నిలిచారు. కంటి చూపు దెబ్బతిన్న వారికి కంటి ఆపరేషన్లు చేయించారు అని లోకేశ్ గురించి అక్కడి ప్రజలు చెబుతున్న మాట.
ఇక లోకేశ్ చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం…క్రిస్మస్ సందర్భంగా 750 మంది పాస్టర్లకు… ఉగాది కానుకగా 650 మంది పూజారులకు బట్టలు పెట్టారు.
రంజాన్ కానుకగా ముస్లిం సోదరులకు తోఫా అందించారు. కార్యకర్తల పెళ్లిళ్లకు తన తరఫున పెళ్లి కానుక ఇచ్చారు. లక్ష్మి నరసింహ గోల్డ్ స్మిత్ సొసైటీ ద్వారా స్వర్ణకారుల కోసం వివిధ సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్ లో కూడా ఇదే విధంగా తన సాయం కొనసాగించనున్నారు కూడా! ఇక ఇప్పుడు ఈ వేసవిలో తాగునీటి కోసం అల్లాడుతున్న మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఇదిగో ఇలా “జలధార” పేరుతో నీళ్ల ట్యాంకులను పంపి బాధ్యత గల నాయకుడు అని అనిపించుకుంటూ.. వారి దాహార్తి తీరుస్తూ, అందరి మన్ననలూ అందుకుంటున్నారు. త్వరలో తన నియోజకవర్గ ప్రజల కోసం ఉచిత వైద్య పరీక్షల కోసం సంచార ఆరోగ్య కేంద్రాలను తీసుకురానున్నారు.
ఇప్పటికే మంగళగిరి ప్రజలు ఆళ్లను గెలిచిపినందుకు గిల్టీగా ఉన్నారని… ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయరు అని అంటున్నారు టీడీపీ నేతలు. చూద్దాం ఏం జరుగుతుందో.