• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మంగ‌ళ‌గిరిని వదలడుగా !

admin by admin
June 3, 2022
in Uncategorized
0
0
SHARES
399
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఒక ఎమ్మెల్యే కావడం అంటే సులువు కాదు.

దానికి రెండే మార్గాలు…

ఒకటి పార్టీ గాలి ఉండాలి

లేదా

అభ్యర్థి పేరు ఊరూ వాడా మారుమోగాలి

మొదటిది ఉన్నా లేకున్నా రెండో మాత్రం సాధిస్తాను అని అంటున్నాడు నారా లోకేష్

చరిత్రలో మంగళగిరి నియోజకవర్గంలో గెలుపు మొహం చూడని టీడీపీని గెలుపు గుర్రం ఎక్కిస్తాను అంటున్నాడు లోకేష్.

నాయ‌కుడు అంటే బాధ్య‌త.. మ‌రియు న‌మ్మ‌కం కూడా ! దానిని కల్పిస్తాను అంటున్నాడు.

మరి అది ఎలా కల్పిస్తున్నాడో… మంగళగిరిలో ఏం జరుగుతుందో చూద్దాం.

వేస‌విలో దాహార్తిని తీర్చేందుకు యువ నాయ‌కుడు నారా లోకేశ్ త‌న వంతు సాయం మంగ‌ళ‌గిరి నియోజ‌కవ‌ర్గంకు చేస్తున్నారు. ఆయ‌న కృషితో ఇక్క‌డ ప్ర‌తిరోజూ వాట‌ర్ ట్యాంక‌ర్ ద్వారా ఇక్క‌డి ప్ర‌జ‌లకు నీరు అందుతోంది.

ఇదే కాదు ఇంకొన్ని సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేయాల‌ని వీరంతా త‌పిస్తున్నారు. ఇప్ప‌టికే కుల‌మ‌తాల‌కు అతీతంగా కొన్ని సేవా కార్య‌క్ర‌మాల పేరిట దాతృత్వం చాటుకున్నారు లోకేశ్.

ఆ క్ర‌మంలోనే చిరు వ్యాపారుల జీవ‌నోపాధికి తోపుడు బండ్లు అందించారు. అదేవిధంగా కొన్ని కుటుంబాల‌కు ఆర్థిక  సాయం కూడా చేశారు. ఈ క్ర‌మంలో భాగంగా చేనేత‌ల కుటుంబాల‌కు ఆర్థిక చేయూత ఇచ్చారు.

అనారోగ్యంతో బాధపడుతున్న నేత‌న్నల కుటుంబాల‌కూ, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న నేత‌న్న‌ల‌కూ అండ‌గా నిలిచారు. కంటి చూపు దెబ్బతిన్న వారికి కంటి ఆపరేషన్లు చేయించారు అని లోకేశ్ గురించి అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్న మాట.

ఇక లోకేశ్ చేప‌ట్టిన సేవా కార్య‌క్ర‌మాల గురించి మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలు చెబుతున్న స‌మాచారం ప్ర‌కారం…క్రిస్మస్ సందర్భంగా 750 మంది పాస్టర్లకు… ఉగాది కానుకగా 650 మంది పూజారులకు బట్టలు పెట్టారు.

రంజాన్ కానుకగా ముస్లిం సోదరులకు తోఫా అందించారు. కార్యకర్తల పెళ్లిళ్లకు  త‌న త‌ర‌ఫున పెళ్లి కానుక ఇచ్చారు. లక్ష్మి నరసింహ గోల్డ్ స్మిత్ సొసైటీ ద్వారా స్వర్ణకారుల కోసం వివిధ సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. భ‌విష్య‌త్ లో కూడా ఇదే విధంగా త‌న సాయం కొన‌సాగించనున్నారు కూడా! ఇక ఇప్పుడు ఈ వేసవిలో తాగునీటి కోసం అల్లాడుతున్న మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఇదిగో ఇలా “జలధార” పేరుతో నీళ్ల ట్యాంకులను పంపి బాధ్య‌త గ‌ల నాయ‌కుడు అని అనిపించుకుంటూ.. వారి దాహార్తి తీరుస్తూ, అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకుంటున్నారు. త్వరలో త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ఉచిత వైద్య పరీక్షల కోసం సంచార ఆరోగ్య కేంద్రాలను తీసుకురానున్నారు.

ఇప్పటికే మంగళగిరి ప్రజలు ఆళ్లను గెలిచిపినందుకు గిల్టీగా ఉన్నారని… ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయరు అని అంటున్నారు టీడీపీ నేతలు. చూద్దాం ఏం జరుగుతుందో.

Tags: AndhraAP CapitalLokeshMangalagiriTDPycpYSRCP
Previous Post

సర్కారు వారి కొత్త ‘పాట’…

Next Post

మళ్ళీ అందరికీ గన్ మెన్లిచ్చిన ప్రభుత్వం

Related Posts

Uncategorized

వైఎస్ వివేకా కేసులో కీల‌క సాక్షి మృతి.. ఎన్నో అనుమానాలు!

June 10, 2022
Uncategorized

వైసీపీది అధర్మ యుద్దం.. విలువలు లేవ్ : చంద్ర‌బాబు

June 10, 2022
NRI

TTA సంబరాలకు భారీగా ఏర్పాట్లు

May 27, 2022
Andhra

జగన్ *సింగిల్* లోగుట్టు ఎవరికి తెలియదులే బాస్

May 9, 2022
Uncategorized

NRI TDP కువైట్ ఆద్వర్యంలో తెలుగుదేశం పార్టీ 40 ఆవిర్భావ దినోత్సవం!

April 2, 2022
Uncategorized

‘పెద్ద’ల సభలో జగన్ ’చిన్న’బోయేలా చేసిన కనకమేడల

March 28, 2022
Load More
Next Post
Sidhu Moose wala

మళ్ళీ అందరికీ గన్ మెన్లిచ్చిన ప్రభుత్వం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • విజయమ్మ ప్రమాదంపై రఘురామ సంచలన ఆరోపణలు
  • జగన్ సర్కార్ పై కాగ్ షాకింగ్ ఆరోపణలు?
  • రఘురామకు సుప్రీం కోర్టు షాక్
  • రాఖీ పండుగ నాడు జగన్ పరువు తీసిన సునీత
  • వైసీపీకి షాక్…కేశినేని నానికి హైకోర్టు ఊరట
  • జనంపై జగన్ ‘ఇంపాక్ట్’..మరో బాదుడుకు రెడీ
  • జస్టిస్ ఎన్వీ రమణపై ఆ పార్టీ అధినేత సంచలన వ్యాఖ్యలు
  • గోరంట్లపై కమెడియన్ ప‌ృథ్వీ షాకింగ్ కామెంట్స్
  • కమ్మ సంఘాలకు ఏమైంది ?
  • చంద్రబాబు గొప్పేంటి? అనే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో…వైరల్
  • శ్రీ‌కాకుళం టీడీపీలో ఏం జ‌రుగుతోంది ?
  • గోరంట్లకు ఏబీఎన్ ఆర్కే షాక్
  • గోరంట్ల ఫోన్ గుట్టురట్టు చేసిన వంగలపూడి అనిత
  • Allu Arjun: ఫ్యాన్స్ కోసం రూ.10 కోట్ల రెమ్యునరేషన్ వదులుకున్న బన్నీ
  • Tamannah : ఇండస్ట్రీలో తమన్నా ఇన్ని అవమానాలు ఎదుర్కొందా..!

Most Read

ఏకాంత భేటీలో చంద్రబాబుతో మోదీ ఏం చెప్పారు?

గోరంట్ల వీడియో లీక్ వెనుక వైసీపీ నేతలు?

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

కమ్మ సంఘాలకు ఏమైంది ?

ఢిల్లీ టూర్ లో చంద్రబాబు హుషార్..వైరల్

అరెరే విజయసాయి.. 4 ట్వీట్లతో జగన్ పరువు తీశారే?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra