ధరల పెంపులో దేశంలోనే ఏపీ సర్కారు నెం.1 స్థానానికి చేరిందని కేంద్రం నిన్న అధికారికంగా చెప్పిన విషయం చదువుకున్నాం.
జగన్ హయాంలో ఏపీలో పప్పు, ఉప్పు, నూనె అన్న డబుల్ రేట్లయ్యాయి. పచ్చిపులుసు చేసుకుని కడుపునింపుకుందాం అంటే చివరకు చింతపండు కూడా డబుల్ రేటు పలుకుతోంది
పోనీ రేషన్ షాపులో తక్కువ కదా కొనుక్కుని తిందాం అంటే అక్కడ ఒక్కోదానిని 70 శాతం పెంచాడు జగన్ రెడ్డి. 40 రూపాయలకు దొరికే కందిపప్పును 67 రూపాయలు చేశాడు. మిగతావి కూడా అంతే రేటు పెంచాడు.
అయ్యో దేవుడా ఎలా బతకాలో మార్గం చెప్పు అని ఈ బాధలు చెప్పుకోవడానికి గుడికి వెళ్తే అక్కడ చివరకు పార్కింగ్ ఫీజు 5 రెట్లు అంటే డబుల్ కే డబుల్ అయ్యాయి. 10 రూపాయల పార్కింగ్ ఫీజు 50 రూపాయలు చేశాడు జగన్ రెడ్డి.
చివరకు తిరుపతి లడ్డు రేటును కూడా 25 నుంచి 50 రూపాయలకు పెంచాడు. హిందువులకు తన సొంత మతంపై ద్వేషం పెంచే ప్రయత్నమే పార్కింగులు, ప్రసాదాలు, రూముల ధరలు పెంచడానికి కారణం.
ఇలా ప్రతి రేటును పెంచుతున్న జగన్ రెడ్డికి లోకేష్ సరైన బిరుదు ఇచ్చారు. అదేంటో తెలుసా ‘‘బాదుడు రెడ్డి’’ ఈయన రేట్లతో బాదేస్తాడు అంతే !
Baadhudu reddy baadhudu scheme explained very very very well by @naralokesh
Frankly yesterday’s speech of @naralokesh is the best. pic.twitter.com/YLhAP8TuTs
— Bhavya🦩 (@unexpected5678) April 8, 2021