సినీ నటుడు రాజ్ తరుణ్ మరియు అతని ప్రేయసి లావణ్య కేసు రోజురోజుకు తుఫానులా మారుతోంది. రాజ్ తరుణ్ తన్ను ప్రేమించి మోసం చేశాడంటూ.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మోజులో పడి తనను వదిలేశాడని లావణ్య పోలీసు కేసు పెట్టడంతో రచ్చ ప్రారంభమైంది. అయితే రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి తన వెర్షన్ చెప్పాడు. లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే.. కానీ ఆమె డ్రగ్స్ అలవాటు పడటం వల్ల దూరం పెట్టానని చెప్పుకొచ్చాడు. డబ్బు కోసమే ఆమె ఇదంతా చేస్తుందని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత వీరి కేసు అనేక మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది లావణ్య విస్తుపోయే విషయాలను బయట పెడుతోంది. 2014లోనే రాజ్ తరణ్ తో తనకు వివాహం జరిగిందని.. రెండు సార్లు ప్రెగ్నెన్సీ వస్తే బలవంతంగా అతను అబార్షన్ చేయించాడని లావణ్య అంటోంది. లావణ్య అందజేసిన ఆధారాలతో నార్సింగి పోలీసులు ఇప్పటికే రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. ఇదే తరుణంలో ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర లావణ్యకు అండగా నిలబడ్డారు. ఆయన ఎంట్రీతో కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది. అంతా తిరిగి రాజ్ తరుణ్ పీకల మీదకి వచ్చింది.
అయితే రాజ్ తరుణ్ కేసులో లావణ్య పేరెంట్స్ ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు వచ్చారు. కూతురు వ్యవహారంలో తాజాగా వాళ్లు తమ వెర్షన్ ను వినిపించారు. తమ అమ్మాయికి అన్యాయం జరిగిందని.. ఇప్పుడు రాజ్ తరుణ్ – లావణ్యలను కలపాలనే ఆలోచన తప్ప తమకు మరే కోరిక లేదని అంటున్నారు. గతంలో రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉండేవాళ్లమని.. అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్తుండేవాళ్లమని.. కానీ గత మూడు నెలల నుంచి కనీసం ఫోన్ చేసినా కలవడం లేదని లావణ్య పేరేంట్స్ వాపోయారు. అలాగే లావణ్యకు ఎలాంటి డ్రగ్స్ అలవాటు లేవని.. అదంతా అబద్థమని చెప్పుకొచ్చారు. లావణ్య-రాజ్ తరుణ్ ఒక్కటైతే చాలని.. తమ కూతురికి అన్యాయం జరిగితే సహించేదే లేదని అంటున్నారు. దీంతో లావణ్య పేరెంట్స్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.