ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో నేల చూపులు చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీపై విశ్లేష ణలు పోటెత్తుతున్నాయి. చేతులారా చేసుకున్నదేనని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సమయం లో తనదైన వ్యాఖ్యలతో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్‌ను ఏకేస్తూ.. ట్వీట్ చేశారు. “రాహుల్ గారూ.. థ్యాంక్సండీ“- అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
“ఎలాగైతేనేం.. మీరు సక్సెస్ అయ్యారు. బీజేపీని దగ్గరుండి పక్కాగా గెలిపించారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ“ అంటూ కేటీఆర్ సెటైర్ పేల్చారు. బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు. కాగా.. ఈ ఎన్నికల్లో ఆది నుంచి కూడా.. రాహుల్ పై విమర్శలు వచ్చాయి. ఇండియా కూటమి నాయకుల నుంచి విపక్షాల వరకు కూడా.. ఆయన వ్యవహార శైలిని దుయ్యబట్టారు.
బీజేపీకి దన్నుగా కాంగ్రెస్ మారిందన్న ప్రచారం ఉంది. ఆప్‌కు మద్దతు ఇచ్చి ఉంటే.. బీజేపీకి అవకాశం ఉండేది కాదన్నది వాస్తవం. అందుకే.. బీజేపీ కూడా.. తొలినాళ్లలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అంటే.. కష్ట మనే భావనకు వచ్చింది. కానీ ఎప్పుడైతే.. రాహుల్ గాంధీ.. ఒంటరి పోరుకు పచ్చ జెండా ఊపి.. తమ ప్రధమ, ప్రధాన శత్రువు కేజ్రీవాల్ అని చెప్పారో.. అప్పుడు కమల నాథుల్లో అంచనాలు పరిపూర్ణంగా చేరు కున్నాయి.
ఎన్నికల ప్రచారంలోనూ.. బీజేపీని పన్నెత్తు మాట అనకుండా.. రాహుల్ కేవలం కేజ్రీవాల్‌నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అక్రమాలకు, అవినీతికి కేజ్రీవాల్ నిలువెత్తు నిదర్శనమని చివరి ప్రచారం రోజుల్లో ఉవ్వెత్తున ఎగిసి పడ్డారు. ఇది పరోక్షంగా బీజేపీకి లాభించింది. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి `జీరో` కనీసం.. ఒక్క స్థానంలోనూ.. లీడ్‌లో లేకపోవడం.. గమనార్హం. ఇది ప్రత్యక్షంగా ఆప్‌కు ఇబ్బందే అయినా.. కాంగ్రెస్ కనుమరుగు కావడం.. రాహుల్ నాయకత్వానికి, ఆయన రాజకీయ పరిణితికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.