తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రేవంత్ రెడ్డికి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డికి ఆరోగ్యకరమైన జీవితం లభించాలని మోడీ ట్వీట్ చేశారు. మోడీకి రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.
ఇక, రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపారు. తాను మలేషియాకు పారియానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన కేటీఆర్…తాను తన ఇంట్లో ఉన్నానని, రేవంత్ బర్త్ డే కేక్ తెచ్చినా కట్ చేస్తానని సెటైర్లు వేస్తూ హ్యాపీ బర్త్ డే రేవంత్ రెడ్డి అని విషెస్ చెప్పారు. రేవంత్ రెడ్డికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఏడాది రేవంత్ కు అద్భుతంగా ఉండాలని, ఆయన ఆరోగ్యంగా జీవించాలని చిరంజీవి ఆకాంక్షించారు.
రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.