ఇటు మీడియా…అటు సోషల్ మీడియా విపరీతంగా యాక్టివ్ గా ఉన్న ఈ రోజుల్లో సాధారణ వ్యక్తులు చేసే వ్యాఖ్యలు కూడా కొన్నిసార్లు వైరల్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలు కాంట్రవర్సీవి కావచ్చు…లేదంటే ఆలోచింపజేసేవి కావచ్చు….ఆ రెండింటిలో ఏ కోవకు చెందినా….క్షణాల్లో వైరల్ అయ్యే పరిస్థితులున్న కాలం ఇది. అటువంటి ఈ టెక్ జమానాలో నటీనటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు…వంటి సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు ఇంకా వేగంగా జనాల్లోకి వెళతాయి.
కాబట్టి, వారు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. కానీ, కోలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ మాత్రం కావాలని పబ్లిసిటీ కోసం చేసిందో….లేక పొరపాటున నోరు జారిందో తెలియదుగానీ….ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెను దుమారం రేపుతున్నాయి. తాను పనిచేస్తున్న సినీ ఇండస్ట్రీలోనే తోటి నటీనటులు, డైరెక్టర్ల కులాన్ని అవమానించే రీతిలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటుల వల్లే ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావడం లేదని, వారిని ఇండస్ట్రీ నుంచి వెళ్లగొట్టాలని కోలీవుడ్ నటి మీరా మిథున్ చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి.
తన అనుమతి లేకుండా తన ఫొటోను ఓ దర్శకుడు వాడుకోవడాన్ని మీరా మాథుర్ తప్పుబట్టింది. ఈ క్రమంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి వల్లనే మంచి సినిమాలు రావడం లేదని, వారి పద్ధతులు బాగుండవని మీరా మాథుర్ వ్యాఖ్యానించడంపై ఇండస్ట్రీ మండిపడుతోంది. అంతేకాదు, ఇండస్ట్రీలోని షెడ్యూల్డ్ కులాల వాళ్లకు అనేక నేరాలకు సంబంధం ఉందని కూడా మీరామాథుర్ చెప్పడంతో దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మీరా మాథుర్ పై దళిత సంఘాలు కేసులు కూడా నమోదు చేశాయి.