పవన్ ... షకీలా సాబ్ - కొడాలి నాని

కొడాలి నాని అలా తీసిపడేసిన పవన్ కి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఎవరూ ఏమీ అనకున్నా బూతులు మాట్లాడే కొడాలి నాని... ఇక బోడిలింగం అంటే ఊరుకుంటారా? మాజీ ముఖ్యమంత్రినే వాడు వీడు అని సంస్కారం లేకుండా బూతులు తిట్టేస్తుంటారాయన. అలాంటిది బోడిలింగం అంటే సహజంగానే ఊరుకోరు కదా.

‘శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం.. ఎంతో మంది నానీల్లో ఒక నాని’ అంటూ పవన్ చేసిన కామెంట్ కు స్పందించిన కొడాలి పవన్ షకీలా సాబ్ అనేశారు. కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో మంగళవారం పేదలకు ఇల్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నాని పవన్ పై విమర్శల దాడిచేశారు. పవనే పెద్ద బోడి లింగం అంటే విమర్శించారు. తామంతా శివలింగాలం కాబట్టే ప్రజలు తమను గెలిపించారు. ఆయన బోడిలింగం కాబట్టే రెండు చోట్ల ఓడించారు అని వ్యాఖ్యానించారు నాని. పవన్ ను గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు.  ప్రజల తిరస్కారానికి గురైనా సిగ్గు, శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమని అన్నారు నాని.

ప్రజల తిరస్కారానికి గురైన సిగ్గు శరం లేదంటున్నాడు నాని... మరి రెండు సార్లు వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రయత్నించి ఓడిపోయారు. మళ్లీ సిగ్గు శరం లేక ఇంకో సారి ప్రజల వద్దకు పోయారా?  2014లో జగన్ ని ప్రజలు తిరస్కరించారు. మరి జగన్ సిగ్గు శరం లేకుండా మళ్లీ ఎన్నికలకు వచ్చారా? ప్రజాస్వామ్యంలో ఓటమి, గెలుపు సాధారణం అయినపుడు మంత్రి హోదాలో ఈ సిగ్గు శరం మాటలెందుకు వస్తాయి.  వైఎస్ భార్య విజయలక్ష్మిని వైజాగ్ ప్రజలు ఓడంచారు. మరి జనసేన నేతలు కూడా ఆమెను నాని అన్నట్లు అంటే ఏం చేస్తాడు. నాని జగన్ కి మేలు చేస్తున్నాడా? కీడు చేస్తున్నాడా?

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.