వైసీపీ హయాంలో వైసీపీ ఎంపీగా పనిచేసిన రఘురామ ను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారన్న ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ వేగవంతమైంది. ఆ కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ కేసులో కామేపల్లి తులసి బాబు అనే వ్యక్తి విచారణ సమయంలో తులసిబాబును గుర్తించేందుకు తాను హాజరవుతానని రఘురామ అన్నారు. ఈ క్రమంలోనే దామోదర్ కు రఘురామ ఒక లేఖ రాశారు.
సీఐడీ కార్యాలయంలో రఘురామను కొందరు ముసుగు వేసుకుని వచ్చిన వ్యక్తులు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయా. ఆ సమయంలో రఘురామ గుండెలపై కూర్చున్నది తులసి బాబు అనే వ్యక్తి అని గుర్తించిన పోలీసులు అతడికి నోటీసులు పంపారు. ఈ క్రమంలోనే గుడివాడకు చెందిన తులసి బాబును విచారణ కోసం పోలీసులు పిలిచారు. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ కు తులసిబాబు సన్నిహితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయలపాల్ ఇచ్చిన సమాచారంతోనే తులసిబాబుకు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.