ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు మనం ఓటు వేసినట్లు గుర్తుగా మన వేలుకు సిరా గుర్తు పెడతారు. మహా అయితే ఆ గుర్తు వేలు మీద అయిదు రోజులు, పది రోజులు, పదిహేను రోజులు ఉంటుంది. కేరళకు షోరన్ పూర్ గురువాయూరప్ప నగర్ కు చెందిన ఉష అనే మహిళ 2016 ఎన్నికల సంధర్భంగా ఓటు వేసినప్పుడు ఆమె వేలుకు సిరా గుర్తు పెట్టారు. తొమ్మిదేళ్లు అవుతున్నా ఆ వేలుకు ఇంకు మాత్రం చెరగడం లేదట. దీంతో ఆమె ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అనేక రకాల సబ్బులు, ఇతర ద్రావణాలు వాడినా ఆమె వేలుకు గుర్తు చెరిగిపోవడం లేదట. పలు ఎన్నికలలో ఓటు వేయడానికి వెళ్లిన ఆమెను ఎన్నికల అధికారులు ఓటింగ్ కు అనుమతించలేదు. ఈ వార్త స్థానికంగా పదే పదే ప్రచారంలోకి రావడంతో కొన్ని సార్లు ఎన్నికల ఏజెంట్లు ఆ సిరా గుర్తు చరిత్ర చెప్పడంతో ఓటేసేందుకు అనుమతించారు.
2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తన వేలుకు ఉన్న ఇంకు గుర్తు కారణంగా ఓటేసేందుకే ఆమె వెళ్లలేదు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వచ్చిన నాయకుడికి తన ఇబ్బందిని ఉష చెప్పుకుంది. దీంతో ఆయన ఎన్నికల అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా వారు ఓటేసేందుకు అనుమతించారు.