జమ్మూ-కాశ్మీర్లో జనాల ఆందోళనలు మళ్ళీ మొదలయ్యాయి.
మంగళవారం యాపిల్ తోటల్లో పనిచేస్తున్న ఇద్దరు పండిట్లను ఉగ్రవాదులు వెతికి మరీ కాల్చిచంపటంతో తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే కాశ్మీర్లోని సోఫియా జిల్లాలోని ఒక యాపిల్ తోటలో కార్మికులు పనిచేస్తున్నారు. కొంతసేపటికి ఇద్దరు తీవ్రవాదులు తోటలోకి వచ్చారు.
ఒక్కళ్ళ పేరు, గుర్తింపును అడిగి తెలుసుకున్నారు. కార్మికుల్లో ఇద్దరు పండిట్లున్నట్లు నిర్ధారణ చేసుకున్నారు.
వెంటనే వాళ్ళిద్దరిని మిగిలిన వాళ్ళ నుంచి వేరుచేశారు. తోటలోనే దూరంగా తీసుకెళ్ళి ఏకే 47 తుపాకితో కాల్చేశారు.
ఈ కాల్పుల్లో సునీల్ కుమార్ భట్ అతని కజిన్ బ్రదర్ ప్రీతమ్ కుమార్ భట్ లు కుప్పకూలిపోయారు. తర్వాత తీరిగ్గా ఇద్దరు ఉగ్రవాదులు వెళ్ళిపోయారు.
- బాబు చెప్పిన 2 మాటలు
- వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…
- ‘ఎట్ హోం’లో నానికి చంద్రబాబు ఏం చెప్పారు?
అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అంబులెన్స్ తెప్పించి ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు సునీల్ కుమార్ చనిపోయాడు.
ప్రితంబర్ పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు.
కానీ, గమనించాల్సిందేమంటే జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్లనే టార్గెట్ గా చేసుకుని మరీ చంపేస్తున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటికి 25 మందిని ఇలా కాల్చి చంపేశారు. తమను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకుని మరీ చంపేస్తుండటంతో పండిట్లంతా తీవ్ర ఆందోళనగా ఉన్నారు.
అయితే, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించారు. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.
ఉగ్రవాదుల దెబ్బకు కొంపాగోడు, ఆస్తులను కూడా వదిలేసుకుని వేలాది పండిట్ కుటుంబాలు దేశంలో ఎక్కడెక్కడికో పారిపోయాయి.
- రోజాకు పవన్ పంచ్ అదిరింది!
- అందమైన పడుచుపిల్ల డ్రెస్సు జారిపోయింది !
- వాషింగ్టన్ డీసీలో భారత భారత స్వాతంత్య్ర దినోత్సవం!!
అలాంటిది నరేంద్ర మోడీ సర్కార్ అలాంటి పండిట్లందరినీ గుర్తించి రకరకాలుగా హామీలిచ్చి మళ్ళీ వాళ్ళందరినీ జమ్మూ కాశ్మీర్లోకి తీసుకొచ్చింది.
విచిత్రం ఏమిటంటే బలవంతంగా లోయలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ బాగోగులు, భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోలేదు.
వెళ్ళిపోయారనుకున్న పండిట్లు మళ్ళీ తిరిగిరావటంతో తీవ్రవాదులు మళ్ళీ కాల్చిచంపటం మొదలుపెట్టారు.
పండిట్లకు ఏ విధమైన భద్రతను ఇవ్వలేనపుడు అందరినీ జమ్మూ కాశ్మీర్లోకి నరేంద్రమోడీ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో ఎవరికీ అర్ధం కావటంలేదు.