• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘ఎట్ హోం’లో నానికి చంద్రబాబు ఏం చెప్పారు?

admin by admin
August 16, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
323
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేసినేని నాని కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందని కేశినేని నాని గతంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఈ క్రమంలోనే నాని సోదరుడు కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని, రాబోయే ఎన్నికలలో తన అన్న స్థానంలో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే నాని వ్యతిరేక వర్గాన్ని చిన్ని కలిశారని, దాంతోపాటు తన కారుపై కేశినేని చిన్ని ఎంపీ స్టిక్కర్ వేసుకోవడంపై నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు, నానికి మధ్య గ్యాప్ వచ్చిందని పుకార్లు వినిపించాయి. ఇక, ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికేందుకు కేసినేని నాని నిరాకరించినట్లుగా వచ్చిన వీడియో సంచలనం రేపింది.

చంద్రబాబు, నానిల మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది అయితే తాజాగా ఈ పుకార్లను పటాపంచలు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుతో నాని మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు నాని తదితర టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబుతో నాని ముచ్చటిస్తున్న ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో, చంద్రబాబు నానిల మధ్య గ్యాప్ లేదని, ఇదంతా ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం అని టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. అయితే, ‘ఎట్ హోం’లో నానికి చంద్రబాబు ఏం చెప్పారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

కాగా,  పార్టీలో తాను అసంతృప్తిగా లేనని స్వయంగా కేసినేని నాని మీడియాకు వెల్లడించారు. తనపై మీడియా అనవసరంగా ఫోకస్ చేస్తోందని తాను ఎంపీగా ఉన్నా, లేకపోయినా విజయవాడకు వచ్చిన నష్టం ఏమీ లేదని కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలాంటి నానిలు లక్ష మంది పుట్టుకొస్తారని అన్నారు. ఇక తన ఎంపీ స్టిక్కర్ ఉన్న కారులో తాను మాత్రమే ప్రయాణిస్తానని, అందులో తన కూతుర్ని కూడా తిరగనివ్వనని నాని చెప్పారు.

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అంశం ప్రైవేట్ వ్యవహారం కాదని అది మహిళల సంబంధించినదని నాని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు చాలా హుందాగా ప్రవర్తించాలని, ప్రజాప్రతినిధులుగా ఉన్నవారిపై ఇటువంటి ఆరోపణలు వస్తే రాజకీయ నాయకులపై ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు.

Tags: ap governor harichandanAt Home programkesineni met chandrababurumours about nanitdp chief chandrababu naidutdp mp kesineni nani
Previous Post

రోజాకు పవన్ పంచ్ అదిరింది!

Next Post

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…

Related Posts

Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Movies

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

May 23, 2025
Load More
Next Post
jagan with wife bharati

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే...

Please login to join discussion

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra