వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను కర్మ వెంటాడుతుందనే చెప్పాలి. 2019లో అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులు ఆపేసిన జగన్కు.. ఇప్పుడు రివర్స్ కర్మ పట్టుకుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారం ఉంది కదా అనే అహంకారంతో జగన్ వ్యవహరించారనే టాక్ ఉంది. నియంతృత్వ పాలనలో జగన్ రాజులా వ్యవహరించి రాచ మర్యాదలు పొందారనే చెప్పాలి. మరోసారి కూడా తానే సీఎం అవుతానని అనుకుని విలాసవంతమైన జీవనం సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కర్మ జగన్ను వదలడం లేదనే టాక్ వినిపిస్తోంది.
జగన్ అధికారంలో రాగానే కోడెల మీద ఫర్నీచర్ దొంగ అనే ముద్ర వేసి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారనేది కాదనలేని నిజం. ఇప్పుడు ఫర్నీచర్ దొంగ అనే ముద్ర జగన్ మీద పడింది. తాడేపల్లిలోని తన ప్యాలెస్లో రూ.కోట్ల ప్రజాదనంతో చేయించుకున్న ఫర్నీచర్ వివరాలు బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష నేత హోదా కూడా సాధించలేకపోయిన జగన్పై ఫర్నీచర్ దొంగతనం కింద కేసు పెట్టేలా పరిణామాలు మారుతున్నాయి.
అప్పుడు అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చేశారు. చంద్రబాబు ఇంటిని కూడా పడగొట్టలని చూశారు. ఇప్పుడు రుషికొండపై జగన్ కట్టుకున్న విలాసవంతమైన భవనాల బాగోతం బయటకు వచ్చింది. మరోవైపు చంద్రబాబు ఇంటికి వెళ్లకుండా రోడ్లను జగన్ బ్లాక్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో జగన్ తన కోసమే ప్రజాధనంతో వేసుకున్న రోడ్డును జనాలకు వదలక తప్పని పరిస్థితి కలిగింది. ఇలా గతంలో తాను చేసిన తప్పుల ఫలితంగా జగన్ కర్మ అనుభవిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది కేవలం ట్రైయిలర్ మాత్రమే అని జగన్ చేసిన తప్పులకు పూర్తి సినిమా ముందు ముందు చూస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.