నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఘటన బాధిత కుటుంబాలను తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శిస్తున్నారు.
ఈ ఘటనలో మరణించిన ఓగురుకు చెందిన మధు గ్రామానికి చంద్రబాబు వెళ్లారు.
మృతుడి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘మీరు అనాథలు కారు.. నేను మీకు అండగా ఉంటాను’ అంటూ ఆ కుటుంబానికి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
అనంతరం మధు కుటుంబానికి చంద్రబాబు రూ. 15 లక్షల చెక్కు… రూ. 1.5 లక్షల నగదు అందజేశారు.
మిగతా మొత్తాన్ని కూడా త్వరలోనే అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. కాగా టీడీపీ నుంచి రూ. 23 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
మిగతా బాధితుల కుటుంబాలనూ చంద్రబాబు పరామర్శించనున్నారు.
క్షతగాత్రులకు కూడా పార్టీ తరఫున పరిహారం ప్రకటించడంతో వారికి పార్టీ నేతలు ఆ మొత్తం అందించనున్నారు.
మరోవైపు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మిగతా ముఖ్యనేతలు మృతులకు నివాళులర్పించారు.