జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై హత్యాయత్నం జరిగింది. బి.కొత్తకోట మెయిన్రోడ్లో సరుకులు తీసుకోవడానికి వచ్చిన సమయంలో సడెన్ కారులో వచ్చిన దుండగులు రామచంద్రపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉంది. సుమారు ఐదుగురు అనామక వ్యక్తులు ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించలేదు. వారి దాడి నుంచి రామచంద్ర తప్పించుకున్నారు. అయితే, ఈ క్రమంలో అతను తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిలో రామచంద్రకు ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి దుండగులు ఈ దాడికి ప్రయత్నించినట్లు బాధితుడు తరఫు వారు ఆరోపణలు చేస్తున్నారు. అయితే, దర్యాప్తు లో వాస్తవాలు బయటకు వస్తాయోమో చూడాలి.