సినిమా రంగంలో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే రాజకీయాల వైపు అడుగు వేసిన నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పొలిటికల్ గా దశాబ్ద కాలంపాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయినా వెనక్కి తగ్గలేదు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్.. పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు.
ఇలా ఎమ్మెల్యేగా గెలిచారో లేదో అలా మంత్రి పదవి పొందారు. అలాగే రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా సైతం బాధ్యతలు చేపట్టారు. రాజకీయ నాయుకుడి నుంచి పాలకుడిగా మారిన పవన్ కళ్యాణ్.. 2023లో దేశ ప్రధాని అవ్వడం ఖాయమంటూ ఆయన విరాభిమాని, జనసేన నేత, ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జోస్యం చెప్పారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే.
ఏపీని వరదలు అంతలాకుతలం చేయడంతో పుట్టినరోజు వేడుకలకు పవన్ దూరంగా ఉన్నారు. కానీ అభిమానులు మాత్రం పలుచోట్ల ఆయన బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. ఈ క్రమంలోనే ఒకచోట పవన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న జానీ మాస్టర్.. `పవర్ స్టార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. 2029లో రాష్ట్రానికి సీఎం అవుతారు. అలాగే 2034లో పీఎం అవుతారు. ఇది రాసుకోండి.. జై జనసేన` అంటూ ఎంతో హుషారుగా స్పీచ్ ఇచ్చారు. ఆయన స్పీచ్ కు అక్కడున్న అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతూ.. పీఎం పీఎం అని అరుస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మరి పవన్‌పై జానీ మాస్టర్ చెప్పిన జోస్యం ఏ మేరకు నిజమవుతుందో చూడాలి.