ఏపీలో వైసీపీ పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదిక `ఎక్స్` వేదికగా పోస్టు చేసిన కార్టూన్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ పోస్టుకు రీట్వీట్లు ఎక్కువగా వస్తున్నాయి. ‘‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’’ క్యాప్షన్‌తో రూపొందించిన కార్టూన్‌ను ఎక్స్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. ఏపీలో అధ్వానంగా ఉన్న రోడ్లపై తెలుగుదేశం – జనసేన పార్టీలు రెండు కలిసి ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ పేరుతో 18, 19 వ తేదీల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చాయి.
ఈ మేరకు ఓ కార్టూన్‌ను పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. బస్సు, ఇతర వాహనదారులు గుంతల్లో పడి పైకి ఎగురుతున్నట్లుగా వ్యంగ్యంగా ఈ చిత్రం ఉంది. జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలారా గుంతల రోడ్లతో ఎన్నాళ్లు మనకు ఈ పాట్లు అని ఎక్స్‌లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. అయితే.. ఈ కార్టూన్ పోస్టు చేసిన స్వల్ప కాలంలోనే నెటిజన్లు దీనిని లైక్ చేశారు. అంతేకాదు.. కామెంట్లు కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి రోడ్లపైనే సీఎం జగన్ ప్రచారం చేయాలని.. అప్పుడు ప్రజల కష్టాలుతెలుస్తాయని కొందరు వ్యాఖ్యానించారు.
కాగా, టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంతోపాటు.. ఎన్నికలకు నాలుగు మాసాల ముందు నుంచి ప్రభుత్వంపై పోరు తీవ్రంగా చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. దీనిలో భాగంగానే తొలుత రహదారుల దుస్థితిపై జనసేన సూచనల మేరకు.. తొలి పోరు ప్రారంభించాయి. తొలి రోజు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేపట్టారు. గుంతలు పడిన రోడ్లలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డు మీద గుంత ఉండటం కాదు, గుంతల మధ్య రోడ్డు ఆనవాళ్లు మిగల్చడం జగన్ రెడ్డి ప్రత్యేకం. ఏపీకి గుంతల ఆంధ్రప్రదేశ్ అన్న పేరు తెచ్చిన జగన్ కి మళ్ళీ ఓటేయడం అంటే, కోరి గోతిలోపడ్డట్టే.#GunthalaRajyamAP #WhyAPHatesJagan pic.twitter.com/5QIJIpKwjE
— Telugu Desam Party (@JaiTDP) November 18, 2023