వచ్చే ఎన్నికల్లో పట్టు సాధించి తీరాలని.. అధికారంలోకి వచ్చి తీరాలని లక్ష్యం నిర్ణయించుకున్న జనసేన పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది? పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నట్టుగా.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చే పరిస్థితిలో పార్టీ ఉన్నదా..? అనే చర్చజోరుగా సాగుతోంది. వాస్తవానికి.. జిల్లాల వారీగా చూసుకుంటే.. కమ్మ, కాపుల బలం ఎక్కువగా ఉన్న జిల్లా కృష్నా. ఇక్కడ టీడీపీ దూకుడు ఎక్కువగా ఉంది. ఒకప్పుడు.. ఇక్కడ ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప.. మిగిలినవన్నీ.. కూడా టీడీపీ గెలుచుకుంది.
కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న అవనిగడ్డ, నాగాయలంక వంటి ఏరియాల్లోనూ టీడీపీకి గట్టి బలమైన కేడర్ ఉంది. ఇక, కమ్మ ఓటుబ్యాంకు కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇలాంటి చోట జనసేన పరిస్థితి ఎలా ఉంది? అనేది ప్రశ్న. మిగతా జిల్లాల్లో కమ్మల ఓట్ల వల్ల టీడీపీకి ఏం ఒరిగేది లేదు. కానీ ఈ జిల్లాల్లో మాత్రం ఆ ఓట్లు కీలకం. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను చూస్తే.. జిల్లాలో కమ్మ వర్గం ఓటుబ్యాంకు ఎక్కువగా ఉన్నచోట్ల.. టీడీపీ బలంగా ఉంది. అయితే.. అది కూడా గుడివాడ వంటి నియోజకవర్గాలను పక్కన పెట్టాల్సిందే. ఇక..మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందని అంటున్నారు.
మరి జనసేనపరిస్థితి ఏంటి? అంటే.. కేవలం .. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఓట్లను చీల్చగలిగే పరిస్తితి లో అయితే… పార్టీ ఉంది. ఉదాహరణకు అవనిగడ్డ, పెనమలూరు, మచిలీపట్నం, కైకలూరు, పామర్రు వంటి చోట్ల కాపు సామాజికవర్గం సహా కొంత అభిమాన యువత.. జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఇది మినహా ఎక్కడా.. కృష్నాజిల్లాలో పార్టీకి సానుకూల సంకేతాలు లేవు. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. రేపు ఒకవేళ.. మెగా అభిమానులు కనుక కూటమి కడితే.. మాత్రం.. వారు జనసేన కు అనుకూలంగా మారితే.. మార్పు కనిపిస్తుంది.
అయితే.. ఆదిశగా పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి.. మెగా ఫ్యాన్స్ అంద రూ.. కూటమి కట్టాలని.. వచ్చే ఎన్నికల్లో పవన్‌కు.. అండగా నిలవాలని అనుకున్నారు. కానీ, సీఎం సీటు విషయంలో నెలకొన్న సందిగ్దత.. పవన్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఎవరికి వారు సైలెంట్‌గా ఉన్నారు. దీంతో కృష్ణాజిల్లాలో పరిస్థితి కొంత సానుకూలంగా ఉన్నా.. బూస్ట్ చేయకపోతే.. అనుకూలంగా ఉండే పరిస్థితి లేదని అంటున్నారు.
Comments 1