ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలు ఏం చేసినా చెల్లిపోతుంది. ఎంతటి దౌర్జన్యాలకు పాల్పడినా, ప్రత్యర్థులపై ఎంతగా రెచ్చిపోయి మాట్లాడినా వారిపై కేసులుండవు, చర్యలుండవు. కానీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా నోరు విప్పితే మాత్రం వారి మీద కేసులు బనాయిస్తారు. తప్పుడు కేసులు పెట్టడానికి కూడా వెనుకాడరు.
ఇక రాజకీయ ప్రత్యర్థులను తీసుకెళ్లి తీవ్రంగా హింసిస్తున్న ఉదంతాలు కూడా తరచుగా జరుగుతున్నాయి. కేసులు, నోటీసుల్లాంటి విషయాల్లో ప్రభుత్వ విభాగాలు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తాయో ఇప్పటికే చాలా ఉదాహరణలు చూశాం. తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి చోటు చేసుకుంది. ఇటీవల వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం, హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే.
దీనికి బదులుగా వైసీపీ నేతలు ఇంకా రెచ్చిపోయి మాట్లాడారు. దారుణమైన భాష ఉపయోగించారు. కానీ పవన్ కళ్యాణ్ మహిళల్ని కించపరిచారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్‌కు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అయినా పవన్ వైసీపీ నేతల్ని కొడకల్లారా అని తిడుతూ చెప్పుతో కొడతా అన్నాడే తప్ప మహిళల్ని ఏం కించపరిచాడని సందేహం రావడం సహజం.
ఐతే తన మూడు పెళ్ళిళ్ల గురించి వచ్చే విమర్శలను తిప్పికొడుతూ.. ఒక పెళ్లి చేసుకుని 30 మంది స్టెప్నీలతో తిరిగే మీరు నాకేంట్రా చెప్పేది అని పవన్ ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో స్టెప్నీ అనే పదం మహిళల్ని కించపరిచేలా ఉందట. ఐతే పవన్ ఏ మహిళ పేరు పెట్టి ఈ మాట అనలేదన్నది గమనార్హం.
ఇష్టం ఉన్న వాళ్లు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకోండి అని పవన్ అనడం కూడా తప్పట. మీకు కుదరకపోతే విడాకులిచ్చి పెళ్లి చేసుకోండని పవన్ అన్నాడు. అందులో ప్రత్యేకంగా తప్పుబట్టడానికి ఏముందో మరి. ఎవరి పేరు పెట్టకుండా స్టెప్నీ అనే పదం వాడినందుకు పవన్‌కు నోటీసులు ఇవ్వడం రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌కే చెల్లింది.
"పవన్ కళ్యాణ్ కు మహిళా కమీషన్ నోటీసులు" pic.twitter.com/Tg2Gpewzuc
— R.V. Kishore ✊ (@rvkishore1992) October 22, 2022