జనసేన కీలక నాయకుడు, తాజాగా మండలికి ఎన్నికైన ఎమ్మెల్సీ నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయంపై స్పందించారు. గత ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ విషయంపై నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం వెనుక రెండు కీలక అంశాలు ప్రభావం చూపించాయని నాగబాబు చెప్పారు. 1) తమ పార్టీ అద్యక్షుడు పవన్ కల్యాణ్ ఇమేజ్ అయితే.. రెండోది పిఠాపురం ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఇక్కడి ఓటర్లు అని చెప్పారు. ఈ రెండు కీలక ఫ్యాక్టర్లే.. పనిచేశాయని. వీటివల్లే పిఠాపురంలో జనసేన అధినేత విజయం దక్కించుకున్నారని తెలిపారు.
అయితే.. “మన నాయకుడి విజయం వెనుక వేరే ఫ్యాక్టర్ ఉందని అనుకునే వారు ఎవరైనా ఉంటే.. వారెవ రైనా.. సరే.. అది వారి ఖర్మ!“ అని నాగబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే.. గత ఎన్నికలకు ముందు టీడీపీ నేత.. వర్మ తాను తప్పుకొని పవన్‌కు టికెట్ ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. ఇది వాస్తవం.
ఇక, ఎన్నికల సమయంలో పిఠాపరంలోని వర్మ ఇంటికి వెళ్లిన పవన్.. ఆయన మాతృమూర్తి నుంచి ఆశీ ర్వాదం కూడా తీసుకున్నారు. కానీ.. తర్వాత.. రాజకీయంగా వర్మకు.. జనసేనకు మధ్య గ్యాప్ పెరుగుతు న్న విషయం తెలిసిందే. అయినా.. టీడీపీ కొంత మేరకు సర్దుకు పోతూనే ఉంది. కానీ, తరచుగా పవన్ విజయం వ్యవహారంపై ఇలా కొందరు వ్యాఖ్యలు చేయడంతో వ్యవహారం ఎక్కడో తేడా కొడుతోందన్న సంకేతాలు వస్తున్నాయి.