ఏపీలోని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల తప్పులను ఎత్తి చూపడంలో కేంద్ర ప్రభుత్వం చూసీచడనట్టు వ్యవహరిస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు.. ఇంకే ముంది.. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసేస్తోంది. దీంతోరాష్ట్రం శ్రీలంక అయిపోతుందని పెద్ద ఎత్తున కేంద్రం అన్ని రాష్ట్రాలకంటే.. ఎక్కువగా అప్పులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీని చూపించింది.
దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఏపీకి అప్పులు ఉన్నాయని తెలిపింది. అయితే.. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత.. కేంద్రం టోన్ మారిపోయింది. అబ్బే.. అదేం లేదు.. ఏపీ ప్రభుత్వానికి.. కేవలం 3.8 లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయి. ఈ విషయంలో తమిళనాడు.. వంటి రాష్ట్రాలు ముందున్నా యి. ఏపీ ఎక్కడో 8వ స్థానంలో ఉందని.. కేంద్రం ప్రకటించింది. దీంతో అసలు.. ఏపీ అప్పులు ఎంత? అనేది ఆసక్తిగా మారింది.
పార్లమెంట్లో ఏపీ అప్పులు కేవలం నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పారు. కానీ అది బహిరంగ రుణాలు మాత్రమే. అంటే.. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం చేసే అప్పులు. కానీ, దొడ్డి దారిలో ప్రభుత్వం చేసే అప్పులు వేరేగా ఉన్నాయి. అవే.. కార్పొరేషన్ లను ఏర్పాటు చేసి..వాటి ద్వారా తీసుకువచ్చే అప్పులు. అదేవిధంగా ఇతర అప్పులు. ఈ మొత్తం కలిపి రాష్ట్ర అప్పులు దాదాపు 8 లక్షల 40 వేల కోట్ల రూపాయలు. ఇక, ఈ జగన్ ప్రభుత్వ అప్పుల లోగుట్టును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీ రెడ్డి లెక్కలతో సహా వెల్లడించారు.
జీవీ రెడ్డి వెల్లడించిన అంశాలను గమనిస్తే.. జగన్ సర్కారు అడ్డగోలుగా.. ఎలా అప్పులు చేసిందో.. ఎప్పుడె ప్పుడు.. ఎంత మొత్తం తీసుకువచ్చిందో.. స్పష్టంగా తెలుస్తోంది. గత పాలకులు చేసిన అప్పులను కూడా రెడ్డి ప్రస్తావించారు. ఈ పరిణామాలను గమనించిన తర్వాత.. ఏటికేడు పెరుగుతున్న అప్పులు.. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయని అంటున్నారు పరిశీలకులు.
రెడ్డిగారు విప్పిన.. జగన్ అప్పుల చిట్టా..
రాష్ట్ర విభజన తర్వాత
1-6-2014 నాటికి అప్పులు: 104,409 కోట్లు
బహిరంగ అప్పు : 1,53,713 కోట్లు
కార్పొరేషన్ అప్పులు: 31,373 కోట్లు
కాంట్రాక్టర్లకు ఉన్న బకాయి: 25,000 కోట్లు
చంద్రబాబు హయాంలో చేసిన అప్పు : 2,10,086 కోట్లు
మొత్తంగా రాష్ట్రం ఏర్పడిన 63 ఏళ్లలోచేసిన అప్పులు: 3,14,495 కోట్లు
——————————
1-4-2019 నాటికి
ప్రభుత్వ అప్పు: 1,90,333 కోట్లు
కార్పొరేషన్ అప్పులు: 1,41,761 కోట్లు
పెండింగు బిల్లులు: 1,31,000 కోట్లు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగు ఉన్న బకాయిలు: 12,650 కోట్లు
వివిధ సంస్థల నుంచి తీసుకున్న ఎఫ్డీలు : 9,580 కోట్లు
ప్రజా పద్దుల నుంచి తీసుకున్న నిధులు: 19,200 కోట్లు
లిక్కర్ బాండ్లపై తీసుకున్న అప్పు: 8300 కోట్లు
పంచాయతీల నుంచి తీసుకున్న సొమ్ము: 7660 కోట్లు
——————————
వెరసి జగన్ హయాంలో ఇప్పటి వరకు చేసిన అప్పులు: 5,20,484 కోట్లు
——————————
మొత్తంగా ఇప్పటి వరకు ఏపీ అప్పులు: 8,34,979 కోట్లు