వైసీపీ నేతల భజనకు ఒక అంతు, హద్దు అనేవీ కనిపించడం లేదు. తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలు సోెషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నివర్ తుపానుతో ఏపీలోని 10 జిల్లాలు నష్టపోయాయి. అందులో 5 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. స్వయంగా సాక్షి పేపర్లోనే 20 లక్షల ఎకరాల్లో పంట నస్టం అని రాశారంటే నష్టం ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కళ్ల ముందు ఇంత దారుణం కనిపిస్తుంటే జగన్ వల్లే నివార్ తుపాను ఆగింది అని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ఉండబట్టే నివార్ తుపాన్ నుంచి తప్పించుకున్నామని ఆమె చేసిన వ్యాఖ్యలు భారీగా ట్రోల్ అవుతున్నాయి.
ఇక డిసెంబరు 31లోగా నష్టపరిహారం రైతుల అక్కౌంట్లలో వేస్తారట. అంటే నెల రోజుల తర్వాత… వేస్తారన్నమాట. ఎంతో తెలుసా… అధికార పార్టీ పత్రిక ప్రకారమే ప్రతి రైతుకు రూ.500 భారీ మొత్తం సాయంగా అందించనున్నారు.
వరద వల్ల రైతులు నష్టపోయారు అని తెలిసినవెంటనే ముఖ్యమంత్రి జగన్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఏరియల్ సర్వే చేశారని రోజా జగన్ ను కీర్తించారు.