'తానా'లో నవ చైతన్యం-జరిగే పనేనా??ఏమో!-'గుర్రం'ఎగరా వచ్చు

NRI
'తానా' నాయకత్వం గురించి 'నమస్తే ఆంధ్ర' కధనాల తరువాత ఆసక్తిగా జరుగుతున్న చర్చలు, తగ్గుముఖం పట్టకపోగా ఈ 'థాంక్స్ గివింగ్' వీకెండ్ సందర్భంగా జరిగే సామూహిక విందు సమావేశాల్లో మరిన్ని కోణాల్లో సాగుతున్నట్లు తెలియవస్తోంది. ఈ సారి ఇదంతా 'తానా' లో శాశ్వత మార్పులకు, మరింత మంచి భవిష్యత్తుకు, మంచి అవకాశంగా భావిస్తున్నారు. సాధారణంగా 90 శాతం పైగా పదవులకు నామకే వాస్తే తంతుగా సాగిపోయే ఎన్నికలు 'శ్రీనివాస గోగినేని' అనే సీనియర్ నాయకుడు, గతంలోనే పోటీచేసి మలి ప్రయత్నంగా 'తానా' అధ్యక్ష పదవికై మళ్ళీ పోటీ చేయవచ్చు అనే విషయంగా మొదలైన చర్చలు, అనేకమంది ఆశావాహుల్లో, నిర్లక్ష్యానికి గురై నిరుత్సాహంలో ఉన్న వారిలో, సరికొత్త ఆశలు చిగురింప చేసి, కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.
చాలా కాలంగా కొద్దిమంది మధ్యే చిక్కుకున్న నాయకత్వ అవకాశాలు తిరిగి అందరికి అందుబాటులోకి రావొచ్చని, కొత్త మరియు పాత కలయికతో అందరినీ కలుపుకు పోతూ సంస్థ ఆశయాలకు, తెలుగు ప్రజల అవసరాలకు అనుగుణంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇప్పటికే వివిధ కార్యవర్గాలలో ఉన్నమంచి నాయకులతో పాటు, తాము కూడా పనిచేస్తూ భాగస్వాములు కావడానికి మంచి అవకాశం ఉంటుందని అనేకమంది భావిస్తున్నారు.అదే విధంగా తమ 'గాడ్ ఫాదర్' లను సంతృప్తిపరిస్తే చాలు తమ బెర్తు ఖాయం అనుకుంటున్న కొద్దిమందిలో, కొత్తగా వచ్చే పోటీ లో ఏమై పోతామో అన్న ఆందోళన మొదలైంది.
ఉదాహరణకు 'తానా' లో 'అప్పలాచియాన్ రీజియన్' గా పిలవబడే 'సౌత్' మరియు 'నార్త్ కరోలినా' రాష్ట్రల్లోని పరిస్థితిని పరిశీలిస్తే క్రింది విషయాలు తెలుస్తున్నాయి. 'తానా' 40+ సంవత్సరాల చరిత్రలో, గత 5 సంవత్సరాలుగానే 'తానా' కార్యక్రమాలు చైతన్యవంతంగా జరుగుతున్నాయి. దాంతో పాటు గత ఎన్నికల సమయాల్లో సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగటమే కాకుండా వివిధ పదవులకై ఆశావాహులు కూడా పెరిగారు. ఈ రీజియన్ కు వచ్చే పదవుల సంఖ్య పరిమితం, కాని ఆశావాహులు అధికం కావటంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి.అలాగే రీజియన్ ముఖ్య కేంద్రాలైన 'షార్లెట్, రాలీ, సౌత్' పట్టణాల మధ్య కూడా సమతూకం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఇప్పటి పదవుల్లో ఉన్న'ఠాగోర్ మల్లినేని', 'సురేష్ కాకర్ల', 'మల్లి వేమన', 'చందు గొర్రెపాటి' తో పాటు గతం లో అవకాశాలు దక్కించుకోలేక పోయిన 'నాగా పంచుమర్తి', 'కుమార్ నెప్పల్లి' మాత్రమే గాకుండా లోకల్ తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షులైన 'రమణ అన్నే', ఇంకా 'పట్టాభి కంఠంనేని', 'దిలీప్ తోటకూరి', 'సురేష్ చలసాని', 'శివ పులిపర్తి' తదితరులు ఛాన్సు కోసం రెడీగా ఉన్నట్లు వినికిడి. అంతేగాక సీనియర్లు, ముఖ్యులు అయినా శ్రీమతి 'రూపా రాజు' గారు, 'సుధాకర్ కొర్రపాటి' వంటి మరికొద్ది మంది పరిస్థితులని బట్టి ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని తీవ్ర ప్రభావం చూపగల ప్రతిభావంతులే. ఇంకా పలువురి దృష్టి లోకి రాని మరికొంతమంది కూడా ప్రయత్నాలు చేయవచ్చని వినికిడి. ఇప్పటికే గరం గరంగా ఉన్న చర్చలు ఏ రూపం తీసుకుంటాయో గమనిద్దాం.
అయితే సాధారణ సంఖ్యలో సభ్యులు, మరీ పెద్ద స్థాయి నాయకులైన వారు లేని 'ఆప్పలాచియాన్ రీజియన్' లోనే ఇన్ని చర్చలు, ఆశావాహులు ఉంటె అత్యధిక సభ్యులు, అనేక మంది నాయకులు, ఎన్నో 'తానా' కార్యక్రమాలు ఉన్నముఖ్య కేంద్రాల్లో ఎటువంటి చర్చలు, పరిణామాలు జరుగుతున్నాయో తేలిగ్గా ఊహించవచ్చు.అలాగే మరిన్ని 'రీజియన్' ల గురించిన వివరాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అధినాయకులుగా చెలామణి అవుతున్న వారు ఆల్రెడీ ఎదో ఒక పదివిలో ఉన్నవారినే అటూ ఇటూ జరిపి అంతా మా ఘనతే అని చెప్పుకుంటున్నారా లేక ఈ సారి కూడా పోటీలను తప్పించి తమ మాట ఇంకా చెల్లుతుందని తెలియజేస్తారా అనేది రాబోయే కొద్ధి కాలం లోనే తెలుస్తుంది.
అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-‘తానా’ బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం
అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.
‘తానా’లో నవ శకం-నిజమా? రంగుల కలా??
‘తానా’లో ఎన్నికల విషయమై ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలు మరింత వేగంగా మారి వచ్చే జనవరి తరువాత నవ శకాన్నిఆవిష్కరించే దిశగా పరిణమిస్తున్నట్లు గోచరిస్తున్నాయి.
తానా జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం’ ఇంతకీ తూనీగ వాలేదెక్కడో?
‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం.
రూమర్ మిల్ ఆఫ్ ‘తానా’ గుస గుసా-పిండి పిండేనా?
*‘తానా ’ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులుకొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై గుస గుసలు
టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
‘తానా’ లో వచ్చే టర్మ్ కొరకు జరుగబోయే ఎలెక్షన్ల విషయమై వివిధ పదవుల్లో ఉన్నవారిలోను, ‘తానా’ రోజువారీ వ్యవహారాల్లో సమాచారం ఉండే వారిలోనే కాక సాధారణ సభ్యుల్లోనూ జరుగుతున్న చర్చలు అనేక మెలికలు తిరుగుతూ చలికాలం లో కూడా మంచి వేడిని రగిలిస్తోంది.
అమెరికా తెలుగు సంఘాలు- ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు అర్ధమౌతోందా? ఇక ఆపండిరా బాబూ!
ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం.
‘తానా’‘అధ్యక్ష‘పోరులో ‘త్రిముఖ’ పోటీ-పూర్వ వైభవం కోసం రంగంలోకి పెద్దలు- కాబోయే అధ్యక్షుడెవరు?
అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు.
‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?
‘తానా’ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర’ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది .
‘తానా’లో సద్దుమణగని సందడి - ఎం జరుగుతోంది?
‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకులమధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత గూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.