జగన్ హయాంలో విద్యుత్ ఒప్పందాల వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అదానీతో సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ కోసం జగన్ 1700 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే విద్యుత్ ఒప్పందాల వ్యవహారంలో మరో గుట్టు రట్టయింది. చంద్రబాబు ప్రభుత్వంపై కక్ష సాధించేందుకు ఆయా సంస్థల నుంచి తీసుకొని విద్యుత్ కు జగన్ సర్కార్ 9500 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా తాజాగా బట్టబయలైంది.
మామూలుగా విద్యుత్ ఒప్పందాల ప్రకారం తీసుకున్న విద్యుత్ కోసం ఉత్పత్తి సంస్థలకు ప్రతి నెలా డిస్కంలు డబ్బులు లెక్కబెట్టి చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుపై రాజకీయ కక్షతో 2014-19 మధ్యలో ప్రభుత్వం కుదుర్చుకున్న 221 పీపీఏలను జగన్ సర్కార్ రద్దు చేసింది. ఆ ధరలు ఎక్కువగా ఉన్నాయని విద్యుత్ బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది. అయితే, ఒకసారి ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన తర్వాత ఆయా సంస్థల నుంచి విద్యుత్ తీసుకున్నా తీసుకోకపోయినా మస్ట్ రన్ నిబంధన ప్రకారం పెట్టుబడి వ్యయాన్ని ఆయా సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకొని ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించాలని డిస్కంలను ఆదేశించింది. దీంతో, విద్యుత్ తీసుకోకుండానే 9500 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. అలా ఆయా సంస్థలకు 9,500 కోట్ల రూపాయలను జగన్ సర్కార్ చెల్లించింది. ఆ చెల్లించిన మొత్తాన్ని ఎఫ్ పీపీ సీఏ పేరు చెప్పి ప్రజలపై భారం మోపింది జగన్ సర్కార్. దీంతో కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయని జనం అంటున్నారు. జగన్ చేసిన పాపం ఇప్పటికీ అధిక కరెంటు బిల్లుల రూపంలో ప్రజలను వెంటాడుతోంది.