ఏపీ ప్రజల విశ్వసనీయతకు తానే కేరాఫ్నని పదే పదే చెప్పుకొనే వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ఇప్పుడు అదే విశ్వసనీయతను కాపాడుకునే పరిస్థితి వచ్చిందని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. 2012లో వచ్చిన ఉప ఎన్నికల సమయంలోనూ.. 2014లో వచ్చిన సాధారణ ఎన్నికల సమయంలోనూ ఏమాత్రం తొట్రుపాటుకు గురికాని.. జగన్..ఇప్పుడు 2024 ఎన్నికలను మాత్రం ఒకింత భయంతోనే ఫేస్ చేస్తున్నారని చెబుతున్నారు.
దీనికి కారణం.. ఎన్నో ఆశలు.. ఎన్నో లక్ష్యాలతో సీఎం జగన్‌ను ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. కానీ, ఆయన వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేక పోయారనేది నిర్వివాదాంశంగా ఉందని పరిశీలకులు అభి ప్రాయపడుతున్నారు. ఈ పరిణామం.. పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడున్న మంత్రి వర్గంలోని మరింత మందిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అంటే.. తన విశ్వసనీయ త.. తన మార్కు మంత్రివర్గం విఫలమయ్యాయని పరోక్షంగా జగన్ అంగీకరించినట్టే అవుతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం మరోసారి మంత్రి వర్గం మార్చడం ద్వారా.. ప్రజలకు ఇచ్చే సందేశం ఏమీ లేదు. కానీ.. జగన్ తనను తాను కాపాడుకునేందుకు… తన ఇమేజ్ను రక్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగానే చాలా మంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. అంటే.. ఇప్పటి వరకు తనకు ఉన్న విశ్వసనీయత ఏమీ లేదని.. పార్టీ లో నేతలను తిరిగి మంత్రులను చేయడం ద్వారా వారి ఇమేజ్ను వినియోగించుకుని.. ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలనే వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఇది ఎలా చూసుకున్నా.. సీఎం జగన్ విషయంలో ఒక మైనస్‌గా మారుతుందనే అభిప్రాయం.. తటస్థంగా ఉన్న కొందరు వైసీపీ నాయకులు చెబుతున్న మాట. అయితే.. నిజంగానే కేబినెట్‌ను విస్తరిస్తారా? అనేది చూడాల్సి ఉంది. అదేసమయంలో పార్టీలోనూ కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరి విశ్వసనీయత.. ఇప్పుడు ఎవరికి గొడుగు పట్టనుందనే చర్చ సాగుతుండడం గమనార్హం.