https://twitter.com/Iloveindia_007/status/1610696512065142785
ఏపీలో సీఎం జగన్ పని అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో టీడీపీ అంటే వణుకు పుడుతోందని అన్నారు. అప్పుల కుప్పగా మార్చిన ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో కూడా అర్ధం కావడం లేదని అన్నారు. అందుకే ప్రతిపక్షాలను అడ్డుకునే వికృత క్రీడకు తెరదీశారని అన్నారు.
కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఈ సందర్భంగాప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అరెస్టు చేయడం పై స్పందించారు.కుప్పం వస్తానని నెల క్రితమే ప్రకటించానని చంద్రబాబు తెలిపారు. కుప్పం పర్యటనపై డీజీపీకి లేఖ రాశానని, ప్రభుత్వం అక్రమంగా చీకటి జీవో తెచ్చిందని ఆరోపించారు.
జగన్ , పోలీసుల దయాదాక్షిణ్యాలతోనే సభలు పెట్టుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విజయనగరంలో వైసీపీ మీటింగ్ పెట్టుకుందని, వారికి ఈ జీవో వర్తించదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం.. దేశంలో ఎవరైనా.. ఎక్కడైనా తిరగొచ్చని, సభలు సమావేశాలు కూడా పెట్టుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు.వైసీపీ పనైపోయిందని, టీడీపీనే రాష్ట్రాన్ని కాపాడగలదని ప్రజలు దీమాగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
అందుకే తమ మీటింగ్‌కు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తిరిగే, మాట్లాడే స్వేచ్ఛ ఉందని అన్నారు. తన నియోకవర్గంలో తాను పర్యటించకూడదా.. తన ప్రజలతో మాట్లాడకూడదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ పనైపోయిందని.. ప్రభుత్వంలో వణుకుపుట్టిందని, పోలీసులు వైసీపీ నేతల కోసం.. ప్రజల కోసమే పని చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.
https://twitter.com/malati_reddi/status/1610699548481191937
పోలీసులపై బాబు ఫైర్
కుప్పం పర్యటనలో ఏపీ-కర్ణాటక సరిహద్దు సమీపంలోని పెద్దూరు వద్ద చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్‌షో, ర్యాలీకి అనుమతి లేదని నోటీసు ఇచ్చేందుకు పలమనేరు డీఎస్పీ యత్నించగా.. నోటీసు తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు. డీఎస్పీపై బాబు ప్రశ్నల వర్షం కురిపించారు. పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వరని డీఎస్పీని నిలదీసిన చంద్రబాబు.. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కుప్పం పర్యటనకు అనుమతి లేదని మౌఖికంగా డీఎస్పీ చెప్పి వెళ్లగా.. ఎందుకు నోటీసు ఇస్తున్నారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని కోరారు.