ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ‘దివ్యాంగురాలైన సీమ పర్వీన్‌కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మీకు మనసెలా వచ్చింది..? పద్దెనిమిది ఏళ్ల వయస్సు వచ్చినా కూడా ఇంకా తల్లిదండ్రులు చేతులపైనే పెరుగుతున్న పర్వీన్ (ఆ బిడ్డ) పెన్షన్ తొలగిస్తారా..? ఆ బిడ్డ ఇంట్లో 300 యూనిట్ల కరెంట్ వాడారని ఆమెకు వచ్చే పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా..? పెన్షన్‌కు ఆనాడు పర్వీన్ అర్హురాలైతే, ఈనాడు అనర్హురాలు ఎలా అయ్యింది..? నిజం చెప్పాలంటే వైకల్యంతో ఉన్నది ఆమె కాదు.. మీరు, మీ ప్రభుత్వం” అని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
సంక్షేమమంటే ఇదేనా జగన్ అని చంద్రబాబు సవాల్ రువ్వారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే పేరుతో మూడు రోజులపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ప్రజలు, యువత, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో మచిలీపట్నంకు చెందిన దివ్యాంగురాలు సీమ పర్వీన్‌కు జగన్ ప్రభుత్వం పెన్షన్ తొలగింపుపై చంద్రబాబు ధ్వజమెత్తారు. సీమ పర్వీన్‌కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చిందంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.
18 ఏళ్ల వయస్సు వచ్చినా కూడా వైకల్యం కారణంగా ఇంకా ఆమె తల్లిదండ్రులు చేతులపైనే పెరుగుతుందని..ఆమెకు ఏళ్ల తరబడి వస్తున్న పెన్షన్‌ను ఎలా తొలగించారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెెంట్ వినియోగం విషయంలో పర్విన్ ఇంట్లో మూడు వందల యూనిట్లు వాడారని పెన్షన్ కట్ చేయడం ఈ ప్రభుత్వం సంక్షేమమా అంటూ చంద్రబాబు విమర్శించారు. దాదాపు తొంభై శాతం వరకు వైకల్యంతో ఉన్న ఆమెకు ప్రభుత్వ నిబంధనల పేరు చెప్పి పెన్షన్ తొలగించడం సీఎం జగన్‌కున్న మానవత్వమా..? అంటూ ఆరోపించారు. సంక్షేమ పథకాల్లో ఆంక్షలతో కోతలపై సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్‌కు చంద్రబాబు ట్వీట్ చేశారు.
పెన్షన్ కు నాడు అర్హురాలు, నేడు అనర్హురాలు ఎలా అయ్యింది? 90శాతం వైకల్యం ఉన్న అమెకు నిబంధనల పేరుతో పెన్షన్ తొలగించడమే మీ మానవత్వమా? వాస్తవంగా చెప్పాలి అంటే వైకల్యంతో ఉంది ఆమె కాదు….మీరు, మీ ప్రభుత్వం.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) April 13, 2023
గుడివాడ #ChandrababuNaidu #Chandrababu #APHopeCBN #CBNAgain #CBN #NCBN #TDP #TeluguDesamParty #AndhraPradesh#NaraChandrababuNaidu pic.twitter.com/c9btgf1sbK
— anigalla???????? (@anigalla) April 13, 2023