ఏపీలో పాలకుల ముందు చూపు లోపించడం వల్ల ఆదాయం దారుణంగా పడిపోవడంతో అభివృద్ధి పనులకు చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితికి చేరుకుంది ఏపీ సర్కారు. అతిముఖ్యమైన అత్యవసర పని అయిన రోడ్ల అభివృద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఆదాయం లేక, అప్పు తగినంత పుట్టకపోవడంతో రోడ్లు వేయడానికి రూపాయి కూడా లేని దయనీయ స్థితిలో ఉంది ఏపీ సర్కారు.
ఇప్పటికే ప్రజలు ఉద్యమాలు చేసేంత ఘోరంగా, అధ్వానంగా ఏపీ రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. మరమ్మతుల దశ దాటిపోయింది. కొత్త రోడ్డు వేయడం తప్ప ఏపీ సర్కారుకు వేరే ఛాన్సు లేదు. కానీ చేతిలో డబ్బులేదు. దీంతో మీరు వాడే రోడ్లకు మా వద్ద డబ్బుల్లేవు. పెట్రోలు మీద ప్రత్యేకంగా రోడ్డు సెస్సు వేసి ఆ డబ్బుతో రోడ్లు వేస్తాం అన్నారు సీఎం జగన్ రెడ్డి.
పెట్రోలు ధరయితే కొండెక్కించాడు. రోడ్డు పనులు మాత్రం ఇంకా మొదలుకాలేదు. అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ రోడ్లపై లారీల వంటి పెద్దపెద్ద వాహనాలే బోల్తా కొడుతున్నాయి. గత 16 నెలల్లో రోడ్లను ఒక్కసారి కూడా అభివృద్ధి చేయకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది.
సాధారణంగా ప్రతి ఏడాది వర్షాకాలం తర్వాత రోడ్లకు మరమ్మతులు చేస్తారు. అయితే, డబ్బు ఎలా సృష్టించాలో తెలియని ఏపీ సీఎం జగన్ 2019 నవంబరు, డిసెంబరు, 2020 జనవరిలో రోడ్లను వేయించలేదు. దీంతో అవి ఈ వానలకు పూర్తిగా పాడైపోయాయి. కార్లయితే ఆ రోడ్లలో వెళ్లలేని పరిస్థితి ఉంది.