రెండంటే రెండు విషయాలు కాపు కులస్థులకు రిజర్వేషన్ దక్కించే విషయమై తాను ఏమీ చేయలేనని చెప్పి తప్పుకున్న జగన్ కు తన ప్రాంతానికి చెందిన సమస్య ఎందుకని అంత సులువుగా కనిపించిందో మరి! అంటే పాదయాత్ర లో చెప్పిన మాటలు మరిచి పాలన సాగిస్తున్నారా ? ఆ విధంగా చూసుకుంటే వాల్మీకి, బోయ కులస్థులను ఎస్టీలలో చేరుస్తానని ఆ రోజు చెప్పిన జగన్ ఇప్పుడెందుకు మరిచి విపక్షాలకు విమర్శాస్త్రాలు అందిస్తున్నారని ? ఆ మాటకు వస్తే కేంద్రం దగ్గర చంద్రబాబు కూడా తెలివిగానే ఆ రోజు వ్యవహరించారు. ఎలా అంటే కేవలం తన తరఫున క్యాబినెట్ తీర్మానం పంపి తరువాత విషయం మీరే తేల్చాలని అన్నారు బాగానే ఉంది కానీ ఆ పాటి కూడా వైసీపీ ఇప్పుడు చేయలేకపోయిందని ఓ వాదన సంబంధిత వర్గాల నుంచి వినిపిస్తోంది.
గిరిజనులనూ, బోయ కులస్థులనూ ఒకే సారి ఇరకాటంలో పెట్టే సమస్య ఇది. కానీ లోకేశ్ బాబు తెలివిగా వ్యవహరించి ఓ లేఖ రాసి మొత్తం తగువును తవ్వి తీశారు. వేటతో కుటుంబం నడిపే కుటుంబాలకు ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురించేలా చేశారు లోకేశ్ బాబు. కానీ ఇది ఇప్పటికిప్పుడు సాధ్యంకానిదని, ఇదే విషయం తమకు తేల్చుకునేందుకు కొంత సమయం కావాలని వైసీపీ ఈపాటికే చెప్పి ఉండి ఉంటే బాగుండేది.
కానీ.. ఎన్నికల ముందు ఈ వివాదం రేగితే అందుకు విరుద్ధంగా క్రియాశీలక వ్యూహాలు జగన్ అమలు చేయాల్సి ఉంటుంది. ఈ లోగా వాల్మీకి, బోయ కులస్థుల సమస్య తీరేలా చేసేందుకు కొన్ని ప్రయత్నాలు కేంద్రం దగ్గర తాము కూడా చేశామని సాయి రెడ్డి అండ్ కో కొంత ప్రచారం చేసుకుంటే లోకేశ్ వేసిన ఎత్తుగడ ఆగేందుకు వీలుంది. అందాక తాత్కాలిక గెలుపు టీడీపీదే !
రాయలసీమకు సంబంధించిన సమస్య అయినప్పటికీ మిగతా ప్రాంతాలనూ ప్రభావితం చేసే అంశం ఒకటి తెరపైకి వచ్చింది. కాదు లోకేశ్ బాబు తీసుకువచ్చారు. చాలా కాలంగా పెను వివాదాలకు తావిస్తున్న వాల్మీకి కులస్థుల విషయమై మరో సారి పెదవి విప్పారు. వీరిని వీరితో పాటు బోయ కులస్థులనూ ఎస్టీల్లో చేర్చాలన్న ప్రతిపాదన ఏనాటిదో!
చంద్రబాబు సర్కారు ఆ రోజు తెలివిగా మంత్రి వర్గంతో ఓ తీర్మానం చేయించి తరువాత దానిని కేంద్రానికి పంపింది. వాస్తవానికి వీరిని ఎస్టీల్లో చేర్చే విషయమై ఎప్పటి నుంచో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. గిరిజనులు ఈ ప్రతిపాదనను అడ్డుకుంటూ వారు సైతం రోడ్డెక్కి నిరసనలు చెబుతున్నారు. తాము ఇటువంటి ప్రతిపాదనలను ఒప్పుకోం అని చెప్పారు కూడా! ఇదే విషయమై కొన్ని ఉద్యమాలు నడిచి తరువాత ఆగిపోయాయి.
చాలా కాలం తరువాత ఇదే విషయాన్ని సున్నిత సంబంధం అయిన విషయాన్ని లేఖ రూపంలో కదిల్చారు లోకేశ్ బాబు. జగన్ కు ఉత్తరం రాసి ఆ రోజు తాము పాటించిన ప్రొసిజర్ కోడ్ ను కొంత వివరించి, కేంద్రం దగ్గర ఈ విషయం పెండింగ్ లో ఉందని, కానీ వైసీపీ ఎంపీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించనందున, సమస్య పరిష్కరించే క్రమంలో దృష్టి కేంద్రీకరించక కేవలం ప్రచార కాంక్షతోనో ఆర్భాటంతోనో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు అని పెదవి విరిచారు. కానీ తాము మాత్రం తమ హయాంలో సత్యపాల్ కమిటీని వేసి నివేదికను కేంద్రానికి పంపగా, దీనిపై మరింత సమాచారం అడిగితే అది కూడా ఇచ్చామని తెలిపారు.
ఇప్పుడు లోకేశ్ బాబు పూర్తిగా తన తెలివితో వైసీపీ సర్కారును ఇరకాటంలో పడేశారు.ఆ రోజు కాపు రిజర్వేషన్లపై పూర్తి స్పష్టత ఇచ్చి ఒడ్డెక్కిన జగన్ వాల్మీకి, బోయ కులస్థుల విషయమై మాత్రం తనదైన హామీ సానుకూల ధోరణితోనే ఇచ్చారు. ఆ తరువాత ఆయన ఆ విషయం పట్టించుకోలేదు అన్నది వాస్తవం.ఇదే టీడీపీ కూడా చెబుతోంది. ఈ దశలో వైసీపీ స్పందన ఎలా ఉండనుందో ?