ఏపీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీదే విమర్శలు వస్తాయి. ప్రభుత్వ విధానాలు కావచ్చు నాయకులు అనుసరిస్తున్న విధానాలు కావచ్చు.. ఏదైనా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి మీదే ఎవరైనా విమర్శలు చేస్తారు. ప్రతిపక్షం కొంచెం ఎక్కువగా విమర్శలు చేస్తుంది. అలా అనుకుంటే మేధావుల నుంచి కూడా వైసిపిపై విమర్శలు ఎక్కువగానే వస్తున్నాయి.
దీన్ని బట్టి ఆ పార్టీ తన విధానాలను మార్చుకోవటమా లేదా ప్రజలకు మరింత సేవ చేయటమా లేదా ప్రభుత్వ విధానాలను మార్చుకోవటం అనేది అత్యంత కీలకం. కానీ ఈ విషయాన్ని వదిలేసినటువంటి వైసీపీ నాయకులు ఫ్లెక్సీ వార్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పోటాపోటీగా జనసేనకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్‌లను పల్లకిలో మోస్తున్నారని ఎదురు దాడి చేయడం వల్ల వైసిపి పై వ్యతిరేకత పెరుగుతోంది.
ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఏదైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి వ్యతిరేకత వస్తుందని గమనించినప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని పరిశీలతలు చెబుతున్నారు. కానీ ఆ ప్రయత్నం ఏది వైసీపీ చేయకపోగా ఎదురు దాడి చేస్తూ వారికి పోటీగా మరిన్ని ప్లెక్సీలను ఏర్పాటు చేస్తోంది. మరింత వివాదానికి దారి తీసేలా వ్యవహరిస్తోంది. ఒంగోలులో జరిగినటువంటి వివాదం జనసేనను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేసింది. దీంతో అక్కడ పోటాపోటీగా వైసీపీ, జనసేన నేతలు కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది.
ఇది వైసీపీకి జనంలో ఉన్నటువంటి ఇమేజ్ ని తగ్గించేటటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. నిజానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు తమపై వచ్చేటటువంటి విమర్శలను సరిదిద్దుకోవాలి. లేదా పరిస్థితి ఇది కాదు ఇది మేము చేస్తున్నాము అని చెప్పుకోవాలే తప్ప ఎదురు దాడి చేయటం, విమర్శకు విమర్శ దాడి అనేటటువంటిది సరైన విధానం కాదని పరిశీలకులు చెబుతున్నారు.