ఒక నగరం అంతర్జాతీయ దృష్టిని ఎపుడు ఆకర్షిస్తుంది
ఒక నగరం కొత్త ఉపాధిని ఎపుడు సృష్టిస్తుంది?
రియల్ ఎస్టేట్ పెరిగితే అది మహానగరం అనుకోగలమా?
అలా అయితే హైదరాబాదులో కంటే కూడా అనంతపురంలో ఒక ఇంటి ధర ఎక్కువగా ఉంది.
మరి అనంతపురం హైదరాబాదుతో పోటీకి రాగలదా? ఒక కుటుంబం అనంతపురం వెళ్లి వెంటనే ఉద్యోగం పొందగలదా?
అది అర్థం చేసుకున్న వాడే నాయకుడు అవుతాడు. ప్రజలకు ఇల్లు, పథకాలు ఇస్తారు బానే ఉంది. మరి వారు రెగ్యులర్ గా సంపాదించాలంటే ఒక మార్గం కావాలి కదా… మరి అదెలా జరుగుతుంది?
వీటన్నింటికి ఒకటే సమాధానం….
ఏ ఊరిలో అయితే లైఫ్ స్టైల్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయో అది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. అది జరిగినపుడు కొత్త ఉద్యోగాులు పుట్టుకొస్తుంది. మరి ఏమిటీ లైఫ్ స్టైల్ సదుపాయాలు?
క్రీడా సదుపాయాలు
పేరు మోసిన విద్యా సంస్థలు
ఎయిర్ పోర్టులు
వెల్ మేనేజ్డ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్స్.
పబ్ లు, రెస్టారెంట్లు
గేమింగ్ జోన్లు
ఇవన్నీ డబ్బుతో కొంటే వచ్చేవి కాదు. ప్రభుత్వం చొరవతో అభివృద్ధి చేయాల్సినవి. ఇవి జరిగినపుడు అంతర్జాతీయ కంపెనీలు ఆ నగరాన్ని గుర్తిస్తాయి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేసే ఉద్యోగులకు తగినంత సోషల్ లైఫ్ లేకపోతే ఇవ్వలేకపోతే ఆ కంపెనీలే అక్కడికి రావు.
అలాంటి దృష్టితోనే అమరావతి ప్రణాళిక రచించబడింది.
విశాల మైన రోడ్లు
అద్భుతమైన క్రీడా సదుపాయాలు
ఎంటర్ టైన్ మెంట్ జోన్లు
ఆకాశ హార్మాల్లాంటి భవనాలు
గ్రీన్ జోన్లు
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు
పేరు మోసిన విద్యా సంస్థలు
ఇవన్నీ చంద్రబాబు ప్రాథమిక ప్రణాళికలో భాగం.
35 వేల మందితో అక్కడ స్టేడియం నిర్మాణం 95 శాతం పూర్తయ్యిందని మీలో ఎంత మందికి తెలుసు?
ఒక స్టేడియం కడితే ఆ సిటీకి ఇంటర్నేషనల్ గా ఎంత ఇంపార్టెన్స్ వస్తుంది?
దాని మీద దాని చుట్టూ జరిగే వ్యాపారం, అది సృష్టించే ఉపాధి ఉద్యోగాలు…. ఇవన్నీ అంచనా వేయాలంటే అవగాహన ఉండాలి. ప్రజల భవిష్యత్తు మీద ప్రేమ ఉండాలి.
చంద్రబాబు హయంలో అమరావతిలో 120 కోట్లతో 34 వేల మంది సిట్టింగ్ కెపాసిటీతో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం దాదాపు పూర్తి అయింది అది చంద్రబాబు విజన్ pic.twitter.com/sRKtxo4icI
— I Love India✌ (@Iloveindia_007) May 24, 2021
మీరు ఊహించారా… ఇంత పెద్ద స్టేడియం మీ దగ్గర్లో వస్తుందని… మిగతా 5 శాతం కంప్లీట్ చేయడానికి కూడా జగన్ సర్కారు సహకరించడం లేదు. మీకర్థమవుతుందా?