ఏ నాయకుడైనా.. ఏ పార్టీ అయినా.. ఏ ప్రబుత్వమైనా.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందన్నది చూసుకోవాలి. నాలుగు గోడల మధ్య కూర్చుని అంతా బాగనే ఉందని భావించి.. మెప్పులకు గొప్పలకు.. చంకలు గుద్దుకుంటే.. జగన్ మాదిరిగానే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. తాజాగా ఏపీలో జరిగిన పింఛన్ల పంపిణీలో వెలుగు చూసిన అనేక విషయాలు.,. జగన్ క్షేత్రస్థాయిలో ఏమాత్రం దృష్టి పెట్టలేకపోయారన్న వాదనను వినిపిస్తోంది. జగన్ హయాంలో రూ.3000 పింఛను ఇచ్చారు.
అయితే.. దీనికి 300 యూనిట్ల కరెంట్లు బిల్లు మించకూడదన్న.. నిబంధనను అమలు చేశారు. అదేసమయంలో ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇవ్వరాదని కూడా.. తేల్చి చెప్పారు. దీంతో వలంటీర్లు.. అప్పట్లో ఇదే పనిచేశారు. ముందు-వెనుక ఆలోచించకుండా.. లబ్ధిదారుల ఆర్తిక పరిస్థితిని.. వారి భౌతిక పరిస్థితిని కూడా అంచనా వేసుకోకుండానే.. పింఛన్లను తొలగించారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది వరకు ఉన్నారని తాజాగా లెక్కతేలింది.
చంద్రబాబు సర్కారు రావడంతోనే జగన్ ప్రబుత్వం తొలగించిన పింఛన్లపై ఆరా తీసింది. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులను కూడా తెలుసుకుంది. 10 వేల మందిలో కేవలం వందల్లోనే ఆర్థిక పరిస్థితి కొంత పరవాలేదు కానీ.. మిగిలి 9 వేల మందికిపైగా పరిస్థితి దారుణంగా ఉందని తెలుసుకుని.. వాటిని పునరుద్దరించింది. ఉదాహరణకు మచిలీపట్నంలో మైనారిటీ కుటుంబానికి చెందిన 21 ఏళ్ల మహిళ మంచానికే పరిమితం. మానసిక వైకల్యంతోపాటు.. శరీరం ఎదగని స్థితిని ఆమె ఎదుర్కొంటోంది. దీంతో జగన్ హయాంలో పింఛను తీసేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక దివ్యాంగ కుటుంబంలో యువకుడికి కాళ్లు లేవు. కేవలం నడుం వరకు మాత్రమే.. అది కూడా ఒంగిపోయిన స్థితిలో శరీరం ఉంది. ఈయన తల్లి.. నడవలేని పరిస్థితిలో మంచానికి పరిమితమయ్యారు. ఉమ్మడి కుటుంబంలో ఉండడంతో విద్యుత్ 300 యూనిట్లు దాటింది. దీంతో ఇద్దరికీ పింఛన్లు లేపేశారు. ఫలితంగా.. వీరు గత నాలుగేళ్లు నానా అగచాట్లు పడ్డారు. ఇప్పుడు ఇలాంటి వారికి పింఛన్లు పునరుద్ధరించారు. మొత్తంగా చెప్పేది ఏంటంటే.. క్షేత్రస్థాయిలో నిజానిజాలు తెలుసుకోకుండా.. ప్యాలెస్కే పరిమితమై.. జగన్ పాలన చేసిన తీరు కారణంగానే.. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది!!