జగన్ ను ఓడించడానికి ఎవరితో అయినా కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్ కచ్చితంగా దిగిపోవాలన్నారు.
ఆంధ్రా థానోస్ లా మారిన జగన్ తాను మంచి చేస్తున్నానని చెబుతూ ప్రజలను ముంచుతున్నారని విమర్శించారు.
జగన్ ను పదవి నుంచి దింపాల్సిన అత్యవసర పరిస్థితి ఏపీకి ఉందన్నారు. అందుకే తాను ఎవరితో అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే శత్రువులతో అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీని నవరత్నాల పేరు చెప్పి జగన్ నిలువునా ముంచేశాడని అన్నారు.
https://twitter.com/SuryaaaaJ/status/1561313619932954626