ఏపీలో కూటమి పార్టీల విజయంపై కొంత ఆశావహ దృక్ఫథం కనిపిస్తోంది. అయితే.. ఇది పూర్తిగా నిర్ధారిం చే విషయం కాదు. కాకపోతే.. కూటమి పార్టీల్లోని నాయకులు.. కార్యకర్తలు మాత్రం అంచనాలు వేసుకుం టున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు గెలిస్తే.. అంటూ కార్యకర్తలు వ్యాఖ్యానించుకుంటున్నారు. చంద్ర బాబు గెలిస్తే.. వెంటనే వచ్చే మార్పు.. అమరావతిపైనే ఉంటుందని అంటున్నారు. అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదేసమయంలో ఆయన చెబుతున్నట్టు తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనే ఉంటుందని అనుకున్నా.. తర్వాత మాత్రం అన్న క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. ఇక, పోలవరంపై సమీక్ష.. సంచలన మార్పులకు కూడా అవకాశం ఉంటుందని సమాచారం. ఇక, ప్రస్తుతం ఉన్న సచివాలయం స్థానంలో పర్మినెంట్ సచివాలయానికి ప్లాన్ చేయడంతో పాటు.. అమరావతి ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లపై ఎక్కువగా దృష్టి పెడతారని తెలుస్తోంది. ఇక, వలంటీర్లను కొనసాగిస్తామని చెబుతున్న చంద్రబాబు.. వారిని కొనసాగిస్తారు.
ఇదేసమయంలో వారికి ఇచ్చే గౌరవ వేతనం విషయంలోనూ నిర్ణయం తీసుకుంటారు. అయితే.. దీనిపై ఇప్పటికిప్పుడు కాకపోయినప్పటికీ.. త్వరలోనే నిర్ణయం ఉండే అవకాశం ఉంది. సచివాలయ వ్యవస్థను కొనసాగించనున్నారు. అదేవిధంగా పింఛన్ల పంపిణీ వ్యవహారంపైనా చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. విశాఖ విషయంలో నిర్మితమవుతున్న రుషికొండపై భవనం విషయంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగని.. దీనిని కూల్చడం కాకుండా.. ప్రభుత్వ అవసరాలకు వినియోగించే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే.. తొలి వంద రోజుల్లోనే సంచ లన మార్పులు ఉండే అవకాశం ఉంటుందని తమ్ముళ్లు అంచనా వేసుకుంటున్నారు. వీటినే ఇప్పుడు ఎక్కువగా ప్రచారంలో పెడుతుండడం గమనార్హం. ఏ నలుగురు కలిసినా.. దీనిని పార్టీ నాయకులు వివరిస్తూ.. పాజిటివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నారు. మరి ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.