మీరు హక్కుల గురించి మాట్లాడవద్దు. చిన్నారులు, మైనార్టీ తీరని వారు, ఇంకా అభాగ్యులు మానం, ప్రాణం కోల్పోయినా కూడా మాట్లాడవద్దు. ప్లీజ్ మేం చెప్పేది వినండి ఈ కేసును పట్టించుకోకండి అన్న విధంగానే గౌరవ పోలీసు యంత్రాంగం నడుచుకుంటున్నదన్న విమర్శలు సోషల్ మీడియాలో బలీయంగా తీవ్ర భావోద్వేగ సహితంగా వినిపిస్తున్నాయి.
ఎక్కడ ఏం జరిగినా సెలబ్రిటీల పిల్లలు చిక్కుకుంటున్నారు. రాజకీయ నాయకుల పిల్లలు, వారి మనవళ్లు,మనవరాళ్లూ, సినీ నటుల పిల్లలూ అడ్డంగా దొరికిపోతున్నారు. కానీ కొన్ని సార్లు వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నారే కానీ తగిన శిక్షలు అన్నవి లేనే లేవు. 16 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్ కు గురైతే పోలీసులు కొందరి పేర్లకు సంబంధించి ఆఘమేఘాల మీద క్లీన్ చిట్ ఇవ్వడంపై అనుమానాలు రేగుతున్నాయి.
ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న హోం మంత్రి మనవడిని కనీసం స్టేషన్ కు కూడా పిలవకుండా రాత్రి 11 గంటల సమయంలో పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఇష్యూకు సంబంధించి ఆయన తప్పేమీ లేదని తేల్చేయడం ఇప్పుడొక ఆసక్తిదాయక పరిణామం. ఈ నేపథ్యాన గత పరిణామాలను ఓ సారి అవలోకిస్తే…
నిహారిక కొణిదెల ఓ పబ్ లో లేట్ నైట్ పార్టీలో చిందులేస్తూ దొరికిపోయింది. అక్కడ ఆ రోజు ఎన్నో డ్రగ్ ప్యాకెట్లు దొరికాయి. ప్రముఖుల బిడ్డలకు పోలీసులు సమీప స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. ఆ తరువాత ఆ కేసు ఏమయిందో కూడా తెలియదు. ఆ తరువాత కూడా ఆ కేసుకు సంబంధించిన పురోగతి గురించి మీడియాలో వార్తలు కానీ వివరాలు కానీ ఏవీ ప్రసారితం కాలేదు.
ఇప్పుడు మరో పబ్ ప్రాంగణాన ఓ గ్యాంగ్ రేప్. నిందుతుల్లో మేజర్లు మరియు మైనర్లూ ఉన్నారు. వీరిలో మైనార్టీ వర్గాలూ ఉన్నాయి. ఇంకా ఇతర వర్గాల పేర్లూ వినపడుతూ ఉన్నాయి. వీటిపై కేసీఆర్ మార్కు ట్రీట్మెంట్ ఉంటుందా ? ఎక్కడో ఉన్న ఆనంద్ మహేంద్ర నిన్నటి వేళ ఆలస్యంగా వెలుగు చూసిన గ్యాంగ్ రేప్ ఇష్యూ పై స్పందించారు. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇక ఈ ఇష్యూపై బీజేపీ ఫైట్ చేస్తోంది. ఎంతవరకూ చేస్తుందో అన్నది కూడా డౌటే !
వాస్తవానికి ఎప్పటి నుంచో ఎన్నో చీకటి కార్యకలాపాలకు హైద్రాబాద్ ముఖ్యంగా పాతబస్తీ అడ్డాగా మారిపోయింది అన్న వాదనలూ మరియు విమర్శలూ ఉన్నాయి. ఉన్న మేరకు,అంటే ఆరోపణలు ఉన్న మేరకు స్పందించాల్సిన పోలీసులు నిద్ర నటిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. చిన్న చిన్న కేసులపై అత్యుత్సాహం చూపే పోలీసులు, బడా నాయకుల కేసులను మాత్రం చూసీ చూడని విధంగా వదిలేస్తున్నారన్న ఆరోపణలూ లేదా అభియోగాలూ ఉన్నాయి.
ఇప్పుడు చలానాల వసూలుకూ, ట్రాఫిక్ నిబంధనల పేరిట అపరాధ రుసుముల విధింపునకూ హైద్రాబాద్ సిటీ పోలీస్ పనిచేస్తున్నారే తప్ప ! పబ్ లపై , క్లబ్ లపై దాడి చేసిన దాఖలాలే లేవు. ఒకవేళ చేసిన ఒకట్రెండు రోజులు మీడియా హడావుడి తరువాత ఏదో ఒక విధంగా, ఏదో ఒక నెపంతో ఆ కేసు ఫైల్ మూసి వేస్తున్నారు.
Why is CM KCR silent ??
We women will come out of kitchen to punish the actual rape culprits if you don’t punish them, When Home Minster grand son name is coming out that he is also accused how come home Minster do Justice to the rape minor victim? #HyderabadRape #MinorRape pic.twitter.com/03oy7K5A7z— Danasari Seethakka (@seethakkaMLA) June 4, 2022