స్క్రిప్ట్‌లు ఎవరో రాస్తున్నారో తెలియదు గానీ.. మాజీ సీఎం జగన్ మాత్రం వాటిని గుడ్డిగా నమ్మి రోజురోజుకు రాజకీయంగా జీరో అయిపోతున్నారు. నిన్నటి ప్రెస్ మీట్ లో జగన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అప్పుల అంశంపై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ పెట్టిన జగన్.. అసలు సంబంధమే లేని చంద్రబాబు తల్లిదండ్రులను మధ్యలోకి లాగి నోటికొచ్చిన విమర్శలు చేశారు.
చంద్రబాబు ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ప్రజలకు చూపించాడా? అని జగన్ ప్రశ్నించారు. తన తల్లిదండ్రులని కనీసం రాష్ట్ర ప్రజలకు చూపించని చంద్రబాబుకి.. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆయన తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నారా? కనీసం వారికి రెండు పూటలా భోజనం పెట్టారా? వారు చనిపోతే తలకొరివి పెట్టాడా? అంటూ పులివెందుల ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించారు.
చంద్రబాబు సంగతి పక్కన పెడితే.. ఆస్తుల కోసం కన్న తల్లి విజయమ్మని, తోడబుట్టిన చెల్లెలు షర్మిలని కోర్టుకు లాగిన ఘనుడు జగన్. సొంత పార్టీ నేతలతో చెల్లెలుపై విమర్శలు చేయించాడు. చివరకు షర్మిల పుట్టుకపై కూడా బురద జల్లాడు. జగన్ ఎంత దుర్మార్గుడో, తన రాజకీయ స్వలాభం కోసం ఎంతకు దిగజారతాడో షర్మిల ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది.
అటువంటి జగన్ చంద్రబాబు తల్లిదండ్రుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన తల్లిదండ్రులు ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు. ఇక నన్ను, నా తల్లిని, నా చెల్లినీ చంద్రబాబు తిట్టించారని ప్రెస్ మీట్ లో జగన్ వాపోతున్నారు. అసలు వారిని తిట్టింది.. తిడుతున్నది వైసీపీ నేతలే కదా? అని అధికారపక్ష పార్టీ నాయకులు చురకలు వేస్తున్నారు.