హనీ రోజ్ వర్గీస్ … ఈ కేరళ కుట్టి అడోరబుల్ స్మైల్ కేరళ యువతను కట్టిపడేస్తోంది.
కేరళలో హనీరోజ్ కి ఉన్నంత క్రేజ్ ఏ స్టార్ హీరోయిన్ కూడా లేదు.
అందుకే ఆమె మోహన్ లాల్ తో కలిసి కూడా కొన్నియాడ్స్ నటించారు.
తమాషా ఏంటంటే… మలయాళ చిత్రాలలో ప్రధానంగా కనిపించే ఈ నటి తెలుగులో కూడా నటించింది.
అదేంటో తెలుసా… 2008లో ముత్యాల సుబ్బయ్య ‘‘ఆలయం‘‘ సినిమాలో నటించారు. అది ఫట్, ఈ వర్షం సాక్షిగా సినిమాలో ఒక పాత్ర పోషించారు. ఇది 2014లో వచ్చిన వరుణ్ తేజ్ సినిమా. అపుడు ఈ అందాన్ని ఎవరూ గుర్తించలేదు. ఈ సినిమా కూడా పోయింది. దీంతో ఆమె తెలుగు వైపు చూడలేదు.
నిజానికి తెలుగు వాళ్లు దురదృష్టవంతులు అని చెప్పాలి. లేకపోతే రోజురోజుకు పెరిగే ఈ అందాన్ని మనం మిస్ చేసుకోవడం ఏంటి?
మళయాళంలో హనీ 2005 లో **బాయ్ ఫ్రెండ్‘‘ సినిమా తో సినీరంగ ప్రవేశం చేసింది. కానీ **త్రివేండ్రం లాడ్జ్** ‘ధ్వానీ నంబియార్’ పాత్రతో ఆమెను కేరళ వాళ్లు గుర్తించడం మొదలుపెట్టారు.
ఇన్ స్టాలో మాత్రమే అక్కౌంట్ ఉన్న హనీకి 1.3 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.
ఏ డ్రెస్ లో ఉన్న ఆ డ్రెస్ కే వెలుగు తెప్పించే అందం హనీ రోజ్ ది. ఆమెకు కేరళలో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న ఆమె చిరు నవ్వుకు దేశమంతటా ఫ్యాన్సే.