• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టాలీవుడ్ లో దానకర్ణుడు… అన్ని కోట్ల దానమా?

admin by admin
February 1, 2022
in Movies, Top Stories
0
0
SHARES
506
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
ఈ మధ్య  సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. నిజం నాలుగూళ్లు దాటేసరికి …అబద్ధం అరవై ఊళ్లు చుట్టేస్తుందన్న రీతిలో…సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అనధికారిక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, చాలామంది సోషల్ మీడియా యూజర్లు కూడా…తాము షేర్, ఫార్వార్డ్ చేసే వార్తలో, అంశలో నిజానిజాలెంత అన్న కనీస తర్కం లేకుండా….వాటిని వైరల్ చేస్తున్నారు. చివరకు, ఆ వార్త వల్ల బాధితులుగా మారిన వారు స్వయంగా వచ్చి వివరణ ఇచ్చే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ కు సంబంధించిన ఓ వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
భారత ఆర్మీకి సుమన్  వందల కోట్ల రూపాయల విలువ గల భూమిని విరాళంగా ఇచ్చారని, టాలీవుడ్ లో సుమనే రియల్ హీరో అని నెటిజన్లు ఓ పోస్ట్ ను తెగ వైరల్ చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సమీపంలో ఉన్న విలువైన 117 ఎకరాల భూమిని దానం చేశారని, ఆయన నిజంగా మనసున్న మనిషని ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, స్వయంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆ భూమిని ఆర్మీకి ఇచ్చారని పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ వ్యవహారం ఆనోటా..ఈనోటాపడి సుమన్ కు తెలిసింది. దీంతో, ఆయన ఈ వార్తపై స్పందించారు.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని, దానిని నమ్మవద్దని సుమన్ అన్నారు. ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి ప్రస్తుతం వివాదంలో ఉందని కాబట్టి దానిపై స్పందించకూడదని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉందని చెప్పారు. ఆ భూమికి సంబంధించిన వివాదం పరిష్కారమైన వెంటనే ఆ భూమి తాలూకు విషయాన్ని తానే స్వయంగా వెల్లడిస్తానని చెప్పారు. తాజాగా సుమన్ క్లారిటీ ఇవ్వడంతో అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.
Tags: 117 acres of landdonation to armyfake newshero sumantollywood actor suman
Previous Post

చంద్రబాబు బిగ్ మిస్టేక్ !

Next Post

చంద్రబాబు కల నెరవేరిందా?

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Load More
Next Post

చంద్రబాబు కల నెరవేరిందా?

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra