డ్రగ్స్ కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు ప్రచారం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ స్పందించారు. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు..ముఖ్యంగా యువతకు డ్రగ్స్ వద్దంటూ ప్రభాస్ విడుదల చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.
‘‘లైఫ్‌లో మనకు బోలెడన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనషులు, మన కోసం బతికే మన వాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. డ్రగ్స్‌ను ఈ రోజు నుంచే వదిలేయండి. మీకు తెలిసిన ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 కు కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’’ అని ప్రభాస్ ఆ వీడియోలో చెప్పారు. ప్రభాస్ మాదిరిగానే మరింతమంది సినీ తారలు డ్రగ్స్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ లో పాల్గొంటారని తెలుస్తోంది.