Here's the Birthday Special Song on our Beloved young Dynamic Leader Sri Kalvankunta Taraka Rama Rao @KTRTRS from @yadavTalasani @Talasani_sai
https://t.co/yiS113Vn6q#LEADER @abhishekpicture#HappyBirthdayKTR pic.twitter.com/ldecQl9PWp
— ABHISHEK PICTURES (@AbhishekPicture) July 24, 2021
తెలంగాణలో కీలక మంత్రి కె టి రామారావు పట్ల భక్తిని చాటుకోవడంలో ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మంత్రులు కూడా అనేక అడుగులు ముందుకు వేస్తున్నారు. కానీ వారందరినీ మించిపోయారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్. తండ్రికి ఉన్న సినిమా పరిచయాలను వాడుకుని కేటీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ భారీ బడ్జెట్ సాంగ్ రూపొందించారు కిరణ్ తలసాని.
తలసాని సాయి కిరణ్ రూపొందించిన… ‘‘కెటిఆర్ లీడర్’’ అని సాగే ఈ పాటలో తెలంగాణ పథకాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. కేటీఆర్ పుట్టిన రోజు బహుమతిగా దీనిని విడుదల చేశారు.
ఒక నిరుద్యోగి ఇంటర్వ్యూలో ఫెయిలవడంతో మొదలయ్యే ఈ సాంగ్ యువత కోసం KTR యొక్క ఉత్తేజకరమైన ప్రసంగం రేడియోలో వినబడటంతో ఆసక్తికరంగా షూట్ చేశారు.
కెసిఆర్ మరియు కెటిఆర్ నాయకత్వంలో మంచి రోజులు వచ్చాయని… షాదీ ముబారక్ పథకం నుండి రితు బంధు వరకు ఈ పాట అన్ని సంక్షేమ పథకాలకు మరియు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తుంది.
నిజానికి తలసాని ఉద్దేశం కేటీఆర్ వద్ద మార్కులు కొట్టేయడమే గాని… ఈ పాట కాస్త ఓవర్ యాక్షన్ గా అనిపిస్తుంది సాధారణ ప్రజలకు. కేటీఆర్ ను కొంతవరకు బ్యాడ్ చేసే అవకాశం ఉన్నా ఆశ్చర్యం లేదు.
ఇక వీడియో విషయానికి వస్తే బాహుబలి రేంజ్ లో షూట్ చేశారు. చివర్లో కేటీఆర్ భారీ విగ్రహం చూపెడతారు. దానిని చూస్తే కేటీఆర్ కూడా మురిసిపోతాడేమో. ఏదేమైనా… ఈ పాట వల్ల కేటీఆర్ కంటే తలసాని సాయికిరణ్ కి ఎక్కువ ఉపయోగంలా ఉంది.