తెలుగుదేశం పార్టీ దెబ్బకు జీవీఎల్ పదవి ఊడింది. గత ఆరేళ్లుగా జగన్ అంటే జీవీఎల్ అంటే ఎందుకు అంత ప్రేమ? ఎందుకు ఆయన జగన్ ను ఎవరయినా విమర్శించినపుడల్లా చంద్రబాబు మీద విమర్శలు చేస్తాడు. జీవీఎల్ పదేపదే ఎందుకు చంద్రబాబు మీద దాడి చేస్తాడు. పోనీ ఆ దాడి బీజేపీకి ఉపయోగపడేలా అయినా చేయడెందుకు… బీజేపీతో పొత్తున్న టీడీపీని విమర్శించి… వైసీపీని ఎందుకు విమర్శించడు…
ఇవి ఆంధ్రులను నాలుగేళ్లుగా పట్టి పీడిస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు కొద్దికాలం క్రితం తెలుగుదేశం పార్టీ పట్టేసింది.జగన్ సోదరి షర్మిల భర్త అయిన బ్రదర్ అనిల్ కుమార్ కు జీవీఎల్ బంధువట.దీనిని బయటకు రాకుండా చాలాకాలం దాచిపెట్టారని, ఆయన జగన్ తో బంధుత్వం వల్లే ఏనాడు జగన్ పై విమర్శలు చేయరు అని టీడీపీ ప్రచారం చేసింది. దీనిని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. రెండ్రోజుల్లో జీవీఎల్ గుట్టు రట్టయిపోయింది. దీంతో బీజేపీ పెద్దలతో మెప్పు పొందడానికి జగన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని బహిరంగంగా ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఈకోణంలో చరిత్రలోకి విశ్లేషించుకుంటూ వెళ్లిన బీజేపీకి అసలు విషయం అర్థమైంది. అసలు టీడీపీ బీజేపీ సంబంధాలు గట్టిగా ఉన్న సమయంలో పొత్తు చెడిపోవడానికి అవసరమైన పునాదులు జీవీఎల్ ద్వారానే జగన్ వేశారని బీజేపీ గ్రహించిందని ఢిల్లీ పాత్రికేయు వర్గాలు చెబుతున్నాయి. దీనిని మనసులో పెట్టుకున్న బీజేపీ సరైన సమయం చూసి బీజేపీలో విస్తరించిన జగన్ తోకను కట్ చేసింది.
తాజాగా బీజేపీ జాతీయ స్థాయిలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో అత్యంత కీలక పరిణామాలు రెండు. ఒకటి పురంధేశ్వరికి జాతీయ స్థాయిలో కేవలం 8 మాత్రమే ఉండే ప్రధాన కార్యదర్శి పదవి దక్కడం. మరో కీలక పరిణామం అధికార ప్రతినిధి పదవి నుంచి జీవీఎల్ ను పీకేయడం.
బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మరో ప్రధాన కారణం ఉంది. ఏపీలో బీజేపీ… వైసీపీతో ఉన్న లోపాయకారి బంధాన్ని తెంచేసుకుంది. దీనికి కారణం…. ఇటీవల హిందు ఆలయాలపై దాడులు జరగడం, నిందితులను పట్టుకోవడంలో జగన్ సర్కారు తీవ్రంగా నిర్లక్ష్యం చేయడంతో ఇది జాతీయ స్థాయిలో తీవ్రంగా ప్రభావం చూపుతుందని భావించిన జగన్ తో సంబంధాలు ఇంకెంతమాత్రం మంచిది కాదని తేల్చుకుంది. పైగా జగన్ బలంగా ఉంటే మనల్ని వాడుకుంటాడు కానీ మనవల్ల రాజ్యసభలో మద్దతు తప్ప జగన్ తో పెద్ద ఉపయోగం లేదని బీజేపీ భావించింది. మరో ఏడాదిలో రాజ్యసభలో బీజేపీకి సొంత మెజారిటీ రానుంది. అప్పుడు అక్కడ కూడా జగన్ అవసరం ఉండదు. అందుకే కీలక బిల్లులు ఆమోదించుకున్న వెంటనే జగన్ కి పిలిచి క్లాస్ పీకారట అమిత్ షా.ఇంకో విషయం…. ఏపీలో జనసేనతో కలిసి నడవాలనుకుంటున్న నేపథ్యంలో జగన్ కి అండగా ఉండేవారిని తప్పించి… జనసేనతో ప్రయాణానికి అవసరమైన వారిని బీజేపీ ఎంచుకుంది. మొత్తానికి బీజేపీ నిర్ణయంతో బీజేపీ ఏపీ కార్యకర్తలు సంతోషంగా ఉన్నా… తమ కోవర్టు అయిన జీవీఎల్ పదవి పీకేయడం వైసీపీ కేడర్లో తీవ్ర విషాదం నింపింది.