టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా ఒకరిగా గుర్తింపు పొందిన విక్టరీ వెంకటేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పోలీసు కేసు నమోదు అయింది. నిజానికి వృత్తిపరమైన జీవితంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ వెంకీ మచ్చలేని మనిషి. వివాదాలకు, వివాస్పద వ్యాఖ్యలకు ఆయనెప్పుడూ దూరమే. అలాంటి వెంకీపై కేసు నమోదు కావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఫిల్మ్ నగర్ లో దక్కన్ కిచెన్ హోటల్ చాలా పాపులర్. నందకుమార్ లీజుకు తీసుకుని ఆ హోటల్ ను నడుపుతున్నాడు. అయితే ఆ హోటల్ ను కొంత భాగం వరకు దగ్గుబాటి ఫ్యామిలీ కూల్చేసింది. తాను లీజుకు తీసుకున్న హోటల్ ను దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వారు కూల్చివేశారంటూ నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. హోటల్ ఉన్న స్థలం తమదంటూ వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాబు సురేష్ బాబు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాత్కాలికంగా హోటల్ జోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కానీ కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దగ్గుబాటి ఫ్యామిలీ శనివారం దక్కన్ కిచెన్ హోటల్ ను పూర్తిగా కూల్చేసింది. దీంతో నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. చర్యలు తీసుకోవద్దని చెప్పినా లెక్క చేయకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే దగ్గుబాటి కుటుంబపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దగ్గుబాటి సురేశ్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, రానా దగ్గుబాటి, అభిరామ్ దగ్గుబాటిలపై 448, 452,458,120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.