ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబుపై అధికార పార్టీ వైసీపీ చేసిన ఆరోపణలు కానీ.. చేసిన విచార ణలు కానీ.. ఏమీ సాధించలేకపోయాయి. అయినా..వైసీపీ మాత్రం ఆయనను పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా ఏదో ఒక కేసులోఇరికించే ప్రయత్నం అయితే చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబుకు ముడుపులు అందాయని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆ ఆరోపణలను నిరూపించుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది.
నిరూపించిన వెంటనే చంద్రబాబుపై అవినీతి ముద్ర వేసి.. రాజకీయంగా లబ్ధి పొందాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారుపరిశీలకులు. దీనిలో భాగంగానే రాష్ట్ర సీఐడీ అధికారులు ఆదాయ పన్ను(ఐటీ) శాఖకు లేఖ రాశారు. గతంలో కొన్ని ఆరోపణలపై అప్పటి చంద్రబాబు పీఏ పి.శ్రీనివాసరావు, నారా లోకేశ్ సన్నిహితుడు కిలారి రాజేశ్‌ను ఐటీ శాఖ విచారించింది. ఇది 2020 ఫిబ్రవరిలో జరిగింది.
అయితే.. ఆ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందజేయాలని సీఐడీ ఆ లేఖలో కోరింది. రాజధాని భూముల విషయంలో చంద్రబాబు నిందితుడుగా కేసు నమోదై ఉందని, అక్కడి నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారాల్లో ఆయనకు ముడుపులు అందాయని, వీటిని నిర్ధారించుకోవడానికి ఐటీ శాఖ సోదా వివరాలు కావాలని అడిగింది. రాజధాని పనుల్లో చంద్రబాబుకు రూ.143 కోట్ల ముడుపులు అందాయని స్వయంగా మంత్రి ఒకరు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబును ఏదో ఒక విధంగాఇరికించాలనేది వచ్చే ఎన్నికల నాటికి ఆయనను దోషిగా చూపించాలనేది వైసీపీ వ్యూహంగా ఉందని అంటున్నారు. అందుకే.. చంద్రబాబు పీఏ, లోకేష్ సన్నిహితు డిని విచారించిన సమయంలో రాబట్టిన వివరాలను తమకు ఇవ్వాలని ఐటీ శాఖకు లేఖరాయడం సంచలనంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.